2019లో మోడీకి ఊహించని పరాజయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రంలో వేలాది కోట్లతో తెదేపా అభివృద్ధి పనులు చేపట్టిందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.చాల రాష్ట్రాలలో కేంద్రం పై రైతులు తిరబడుతున్నారని, దేశంలో మోడీ సామ్రాజ్యాన్ని స్థాపించి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. 2019లో మోడీకి ఊహించని పరాజయం ఎదురుకాబోతుందని, 2019లో జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిని నిర్ణయించడంలో చంద్రబాబు కీలకం కాబోతున్నారన్నారు. రాష్ట్రంలో జనసేనకు ఎటువంటి ఎజెండా లేదని, దేశానికి అన్యాయం చేస్తోన్న మోడీని గద్దె దింపడమే తెదేపా ధ్యేయమన్నారు. కనీసం శ్రీకాకుళం లో తుఫాన్ బాధితులను పరామర్శించడానికి జగన్ కు కాళీ లేదా అని ఆయన ప్రశ్నించారు. కుర్చీయే ప్రధానంగా ప్రతిపక్ష , జనసేన నాయకులు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మరో ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ. త్వరలో అమరావతిలో ఘనంగా ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ 2014లో చాలా వాగ్ధానాలు చేశారని, పదవి వచ్చాక వాటిని మరిచారన్నారు. పెరుగుట విరుగుట కొరకు అన్నట్లు మోడీ వినాశనం ఖాయమన్నారు. కావాలనే కుట్రపూరితంగా ఐటీ దాడులు చేస్తున్నారని రోజు రోజు కి మోడీ గ్రాఫ్ పడిపోతుంని మురళీమోహన్ దుయ్యబట్టారు.

Share.

Leave A Reply

%d bloggers like this: