జగన్ తో నన్నపనేని భేటీ…వైసీపీలోకి జంప్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలవడం, టీడీపీ అత్యంత దారుణంగా ఓటమి పాలవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రం లో వలస నేతలు పెరిగిపోయారు. టీడీపీ నుంచి అనేకమంది ముఖ్య నేతలు బీజేపీ లో చేరుతుంటే… మరికొంతమంది నేతలు వైసీపీలో చేరుతున్నారు. దీంతో చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు పార్టీని విడతారో అర్ధం కానీ పరిస్తితుల్లో ఉన్నారు అధినేత చంద్రబాబు.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్మన్, టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో కలిశారు..ఇప్పుడు ఈ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న చంద్రబాబు తలపెట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో మహిళా పోలీసులను కులం పేరుతో దూషించినందుకు గాను ఆమెపై కేసు నమోధు చేశారు. ఈ నేపధ్యంలో ఆమె సీఎం జగన్ ని కలవడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంతి. అయితే ప్రస్తుతం నన్నపనేని కూతురు – అల్లుడు వైసీపీలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే వారేమీ ఆమె వెంట కనిపించలేదు. ఒంటరిగానే జగన్ కార్యాలయం వద్దకు నన్నపనేని వెళ్లినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, జ‌గ‌న్ తో టీడీపీలో కీలక నేతగా ఉన్న న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి భేటీ నేప‌థ్యంలో ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేర‌బోతున్నార‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: