నన్నపనేనికి 5ఏళ్ళు జైలు శిక్ష..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్, టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి పై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చలో ఆత్మకూరు నేపథ్యంలో చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నన్నపనేని రాజకుమారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను మంగళగిరి పీఎస్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్‌ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని అలా మాట్లాడడం సరికాదని అన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎస్ఐ అనురాధ అన్నారు. ఆమె అన్నట్టుగానే ఈ రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. నన్నపనేని రాజకుమారి మరియు సత్యవాణి అనే మరో మహిళపై ఐపీసీలో 353, 506, 509 r/w 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీంతో నన్నపనేని రాజకుమారికి 5ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: