గ్యాంగ్ లీడర్ రివ్యూ ….!

Google+ Pinterest LinkedIn Tumblr +
తెలుగు సినీ ప్రేమికుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మెగా స్టార్ చిరంజీవి సినిమా గ్యాంగ్ లీడర్. బాక్స్ ఆఫీసు రికార్డులన్ని బద్దలు కొట్టి , అప్పటి యువత మదిలో చెరగని ముద్ర వేసింది చిరంజీవి గ్యాంగ్ లీడర్ . సరిగ్గా 27సంవత్సరాల తరువాత మల్లి అదే మ్యాజిక్ ని తిరిగి రిపీట్ చేయాలన్న సంకల్పంతో న్యాచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఈ గ్యాంగ్ లీడర్, కాసుల వేటకై కథన రంగంలో కాలు పెట్టింది . పక్కింటి అబ్బాయి పంచులతో వెండి తెరపై తనదైన హ్యూమర్ ని పండిస్తూ సాధారణ హీరో నుండి స్టార్ హీరో గా ఎదిగిన నాని, జెర్సీ లాంటి హై ఏమోషినల్ మూవీ తరువాత , ఈ గ్యాంగ్ లీడర్ తో మరి తన స్థాయిని మరింత పెంచుకున్నాడా , ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా.., లేద.., అసలు బాక్స్ ఆఫీస్ రియల్ టాక్ ఏంటన్నది మనమిప్పుడు మా మహా రివ్యూ లో చూసేద్దాం .
కథ…!

సినిమా ఓపెన్ చేస్తే …ఆరుగురు వ్యక్తులు 150కోట్ల బ్యాంక్ రాబరీ చేసి పారిపోతుండగా దొంగల గ్రూప్ లోని ఒక వ్యక్తి మిగితా ఐదుగురిని చంపి డబ్బు నెత్తికెళ్లిపోతాడు . కట్ చేస్తే సరిగ్గా సంవత్సరం తరువాత.. చనిపోయిన ఆ ఐదుగురి కుటుంబలా తాలూకు నలుగురు మహిళలు, ఒక పాప కలిసి , తమ కుటుంబ సభ్యులని చంపినా హంతకుడిని హతమార్చి పగ తీర్చుకోడానికి ఒక ఫేమస్ రివెంజ్ నావెల్ రైటర్ ‘ పెన్సిల్ పార్థసారధి ‘ అనగా హీరో నాని ని కలిసి సహాయం అడగడం జరుగుతుంది . హాలీవుడ్ సినిమాల కథలను కాపీ కొట్టి నావెల్స్ రాసుకునే నాని, ఈ ఐదుగురి పగలో భాగమై వారికి సలహాలు ఇస్తూ జరుగుతున్న అనుకోని రసవత్తరమైన సంఘటనలని తన కథగ రాస్తూ ఉంటాడు .కరెక్ట్ గా విలన్ కార్తికేయను చంపే సమయానికి మహిళలందరూ తమ పగను వదిలేయడం జరుగుతుంది. ఆ తరువాత హీరో నాని ఈ మహిళలకు న్యాయం చేశాడా , తన హాఫ్ నాలెడ్జితో విలన్ని ఎలా పట్టుకున్నాడు , అసలు వీళ్ళు రేవెంజిని ఎందుకు వదిలేసారన్నదే ఈ గ్యాంగ్ లీడర్ అసలు కథ .

కథనం విశ్లేషణ …!

ఇష్క్ , మనం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి , స్టైలిష్ క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి పేరున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ మొదటగా ఈ కథను బన్నీ కి చెప్పడం , ఓ నెల రోజులు స్టోరీ సిట్టింగ్స్ కూడా జరిగిన తరువాత బన్నీ ఈ ప్రాజెక్టు నుండి అర్దాంతరంగా తప్పుకోవడంతో నానితో ఈ సినిమాను చేయడం జరిగిందని సినీ ఇండస్ట్రీ టాక్ . టాప్ స్టార్ హీరో ఐన బన్నీ ఈ సినిమా నుండి తప్పుకోన్న కారణం ఈ సినిమా చూసిన వారికి సహేతుకమే అనిపిస్తుంది. ఒక సీరియస్ ఏమోషినల్ రివెంజి డ్రామాలో కామెడీ ని బ్లెండ్ చేయటం ఏ దర్శకునికైనా కత్తిమీద సాములాంటి విషయం . ఏమాత్రం తడబడ్డ , ప్రేక్షకుడు ఒకవైపు సీరియస్ రివెంజి థ్రిల్ ని ఎక్స్ పీరియన్స్ చేయలేక, మరోవైపు మంచి కామెడీని ఆస్వాదించలేక , రెండిటికి చెడిన రేవై మొత్తానికి సినిమా మిస్ ఫైర్ అయ్యే అవకాశాలుంటాయి . బహుశా బన్నీ దీన్ని పసిగట్టే సినిమా నుండి తప్పుకునుంటాడు . కనిపిస్తే విలన్ని పొడిచేద్దామన్న పగతో తిరుగుతున్నా మహిళలు , సినిమా ఓపెనింగ్ లో జరిగిన థ్రిల్లింగ్ బ్యాంక్ రాబరీ ఎపిసోడ్ , మరియు విలన్ కార్తికేయ ఇంట్రడక్షన్ సీన్ లోని అతని క్రుయాలిటీ చూసి , అసలు సిసలైన రివెంజిని ఎక్స్ పెక్ట్ చేస్తారు అభిమానులు . కానీ అలాంటివేం లేకుండా కేవలం నాని హ్యూమర్ పై డిపెండ్ అవుతూ , ప్రతి సీన్లో కామెడీ చేయడానికి చేసిన ప్రయత్నాలు అక్కడక్కడా ఫలించిన అసలైన కథని దెబ్బతీశాయన్న భావన, సినిమా చూసే అభిమానికి కలుగుతుంది .

ఫెసి స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని థ్రిల్ చేయాల్సిన ఈ రివెంజి డ్రామా , వెరీ స్లో నరేషన్ తో సాగిపోతుంటుంది . మహిళల రివెంజికి సహాయం చేస్తానన్న హీరో నాని ఇంటర్వెల్ సమయానికి గాని.. అసలు విలన్ ఎవరా అని తెలుసుకోలేకపోతాడు . ఫస్ట్ ఆఫ్ లో చంపినా వ్యక్తి ఎవరో తెలీడంతో , సెకండ్ హాఫ్ లో హీరో నుండి థ్రిల్లింగ్ యాక్షన్ ని ఎక్స్ పెక్ట్ చేస్తారు జనాలు . విలన్ ని చంపే అవకాశాలొచ్చినా మహిళలు రివెంజి నుండి వెనుదిరిగి భయపడటంతో.., అనాథ ఐన నాని ఈ ఐదుగురి మహిళలతో ఏమోషినల్ కనెక్ట్ అయి ,వారి రివెంజిని తన రివెంజిగా మార్చుకుని విలన్ తాట తీస్తాడనుకుంటే, విలన్ ముందరే తప్పించుకుంటూ ఎందుకు తిరుగుతాడో జనాలకు అర్థంకాని పరిస్థితి . ఐదుగురు మహిళలతో రివెంజి అని సినిమా మొదట్లో ఎత్తుకున్న బ్రిలియన్ట్ ఐడియాను గ్రిప్పింగ్ గా చెప్పడంలో దర్శకుడు కొద్దిగా తడపడ్డాడనే చెప్పొచ్చు . సీరియస్ రేవెంజి డ్రామాగా ముగుంచాల్సిన క్లైమాక్స్ లో , కావాల్సిన వారు చనిపోయి అనాథలుగా మిగిలిన ఈ ఐదుగురు మహిళలు మరియు నాని అందరు ఒక కుటుంబంగా మారిపోయే లా చేసిన ఫామిలీ డ్రామ స్క్రీన్ పై అంతగా పండకపోవడం గ్యాంగ్ లీడర్ సినిమాకి ప్రధాన సమస్య .

సినిమా ఆధ్యంతం ఎంత కామెడీ చేసిన , థ్రిల్ చేసిన ,ఎం చేసిన కానీ ఆఖర్లో ప్రధాన పాత్రలతో ఆడియన్ ఏమోషినల్ గా కనెక్ట్ అవుతేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది ..గ్యాంగ్ లీడర్ లో ఈ మ్యాజిక్ మిస్ అయింది . బాయ్ ఫ్రెండ్ ని కోల్పోయిన అమ్మాయిగా హీరోయిన్ ప్రియాంక ఆరుళ్ మోహన్ పాత్ర , పర్ఫార్మెన్స్ కి అంతగా ప్రాధాన్యత లేదనిపిస్తుంది . హీరోయిన్ స్క్రీన్ అఫియరెన్స్ బావున్నా నానికి హీరోయిన్ కి మధ్యలో లవ్ ట్రాక్ స్థాయికి మించి ఉండకపోవడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతగా పండలేదనే చెప్పుకోవచ్చు . మిగిలిన నాలుగు రు మహిళల పాత్రలతో నాని భావోద్వేగాలను ఏమంత ఏమోషినల్ గా చూపెట్టకపోవడంతో క్లైమాక్స్ లోని సెంటిమెంట్ డ్రామా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోలేకపోయింది .

వెన్నల కిషోర్ గే కామెడీ , ప్రియదర్శి పంచులు , ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో అక్కడక్కడా మెరిపించాయి . నానికి ,వెన్నల కిషోర్ మధ్యలోని కామెడీ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు . సాధారణమైన సీన్లను కూడా తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసి అనిరుధ్ తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు . సీనియర్ నటి లక్ష్మి సెంటిమెంటుని ,కామెడీని అలవోకగా చేస్తూ మెప్పించింది .ఇక విలన్ పాత్ర చేసిన హీరో కార్తికేయ సాహసోపేతమైన నిర్ణయన్నీ అభినందించాల్సిన విషయం అయినా , విలన్ పాత్రతో అంతగా ఆకట్టుకోలేదని చెప్పొచ్చు . ఆకారిగా న్యాచురల్ స్టార్ నాని ,స్వతహాగా స్టార్ అయినప్పటికీ , చిన్న స్థాయి హీరోలు చేయాల్సిన సినిమాను ఎంచుకుని , కథకు సంబంధం లేకపోయినా తనదైన కామెడీ టైమింగ్ తో సినిమాను ఒంటిచేత్తో మోసుకెళ్లిపోయాడు . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి అప్పటి గ్యాంగ్ లిడర్ లోని ఏమోషినల్ రివెంజి లేకపోయినా , నాని తనదైన స్టయిల్లో ఈ గ్యాంగ్ లీడర్ ని గట్టెకించాడని చెప్పొచ్చు. చివరిగా సీరియస్ రివెంజి కథలలోకి , ఎంటర్టైన్మెంట్ అంత స్మూత్ గా బ్లెండ్ అవ్వదన్న బేసిక్ స్క్రీన్ ప్లే ఫార్ములని మరిచి చేసిన ఈ డెరింగ్ అటెంప్ట్ , అన్ ఫార్చ్యూ నెట్లీ వన్ టైం వచబుల్ గా మిగిలిపోతుంది .
మహా రేటింగ్- 2.5/5..,

Share.

Comments are closed.

%d bloggers like this: