వాల్మీకి రిలీజ్ క్యాన్సిల్ …?

Google+ Pinterest LinkedIn Tumblr +

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం వాల్మీకి . ఈ నెల 20న ఎంతో గ్రాండ్ రిలీస్ చేయాలనీ ప్లానింగ్ లో ఉన్న చిత్ర యూనిట్ అనుకోని అవరోధం వచ్చి పడింది . నిత్యం ఎదో ఒక కాంట్రవర్సిస్ తో తన సినిమాల్ని చిక్కుల్లో వేసుకుంటారు హరీష్ శంకర్ . వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈ యువ దర్శకుడు , ఇప్పుడు ఈ సినిమాకి వాల్మీకి అనే టైటిల్ తీవ్ర వివాదాలకు దారితీస్తుంది . ఈ టైటిల్ పై బోయ కులస్తులు ఆగ్రహా ఆవేశాలకు లోనవుతున్నారు . ఒక గ్యాంగ్ స్టార్ మూవీకి మా కుల ప్రముఖుడైన వాల్మీకి పేరుని పెట్టి మా మామనోభావాల్ని దెబ్బతీయడం ఏంటని నిప్పులుచెరుగుతున్నారు . ఈ చిత్రంతటిల్ మార్చాలని బోయ హక్కుల పోరాట సమితి గల్లీ నుండి ఢిల్లీ వరకు చేయని ప్రయత్నం అంటూ లేదు . అనంతపురంకి చెందిన ఎంపీ కోర్టులో కేసులు నడిపించడం ఇటీవల కేంద్ర సమాచారం ప్రశార శాఖ మంత్రిని కలవడం వేడెక్కించింది.

అయితే చిత్రయూనిట్ మాత్రం టైటిల్ మార్పు ప్రస్థావన లేకుండానే.. ఈ నెల 20న సినిమాని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా కోర్టులో పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరో వరుణ్ తేజ్‌కు.. చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. డీజీపీకి.. సెన్సార్ బోర్డుకి.. ఫిలిం ఛాంబర్‌కు నోటీసులు జారీ చేయడం టాలీవుడ్ లో చర్చకు వచ్చింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో యూనిట్ సభ్యులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ఈ నాలుగు వారల విచారణ వరకు ఈ సినిమాను విడుదల కానివ్వమని బోయ హక్కుల పోరాట సమితి చెప్తున్నా మాట .కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తరువాతనే విడుదలకు అనుమతిస్తామని అంటుంటే ,లేదు లేదు ఈనెల 20న మేము విడుదల చేసి తీరుతామని చిత్ర యూనిట్ సభ్యులు ఘంట పదంగా చెప్తున్నా మాట . ఇరువైపులా నుండి ఎవ్వరు తగ్గకపోవడంతో ఇండస్ట్రీలోని వాతావరణమొక్కసారిగా వేడెక్కింది . ఎవరివైపు నుండి ఇంకేం స్టేట్మెంట్ వినాల్సొస్తుందో ఇది ఇంకెంత వివాదం అవుతుందో అని ఇండస్ట్రీ పెద్దలు కంగారు పడుతున్న వేళా ,వాల్మీకి చిత్ర యూనిట్ మాత్రం అనుకోకుండా దక్కుతున్న ఫ్రీ పబ్లిసిటీ సినిమాకి కచ్చితంగా ప్లస్ అవుతుందన్న అంచనాల్లో ఉన్నారు .

Share.

Comments are closed.

%d bloggers like this: