మహేష్ బాబుపై రాములమ్మ హాట్ కామెంట్స్ ….!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు సేన్సేషినల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ’ సరిలేరు నికేవ్వరు ‘ . ఈ సినిమాకి ఉన్న ఎన్నో ప్రత్యేకతలలో ముక్యమైనది విజయశాంతి రీఎంట్రి . ఈ సినిమాలో ఒకముక్యమైన పాత్రలో విజయశాంతిని కాస్టింగ్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి . విజయశాంతి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయశాంతి, మహేష్ బాబు 30 ఏళ్ల క్రితం కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో విజయశాంతి, మహేష్ తల్లికొడుకులుగా నటించారు. తాజాగా మహేష్ బాబు ఆ చిత్రాన్నిగుర్తు చేసుకున్నాడు. కొడుకుదిద్దిన కాపురం చిత్ర సెట్స్ లో విజయశాంతితో కలసి ఉన్న ఓ అందమైన ఫోటోని షేర్ చేశాడు. ‘1989లో తొలిసారిగా విజయశాంతిగారిని కలిశాను. లొకేషన్ ‘కొడుకు దిద్దిన కాపురం’ మూవీ సెట్స్. 30 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారితో మళ్లీ కలిసి పని చేస్తున్నాను. లైఫ్ ఒక ఫుల్ సర్కిల్ తిరిగినట్లు ఉంది” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

విజయశాంతిని పొగుడుతూ మహేష్ చేసిన ట్వీట్ కి విజయశాంతి చేసిన రీ ట్వీట్ ఇండస్త్రిలో హాట్ టాపిక్ గా మారింది . ‘కాలగమనంలో సాధారణంగా అయితే ప్రకృతి మార్పును తీసుకొస్తుంది. కానీ మహేష్ బాబుగారి వ్యక్తిత్వంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆయన మనసే ఆయనకు గొప్ప అభరణం. 1989లో మా కాంబినేషన్ మొదలవ్వడానికి ముందు.. ఇదే రోజు 1980‌లో ‘కిలాడీ కృష్ణుడు’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణగారితో జంటగా నా సినీ ప్రయాణం మొదలైంది. కళ అనేది అనంతం. అది మీలాంటి వారి వల్ల భ్రమణం చేస్తుంది” అని విజయశాంతి ట్వీట్ చేయడం జరిగింది…, రాములమ్మ ఇప్పుడు ఎంత ఫైర్ బ్రాండ్ అయిన కూడా , ఇండస్త్రిలో విజయశాంతి సుదీర్గ ప్రయాణం వెనుకల సూపర్ స్టార్ కృష్ణ , విజయనిర్మల గార్ల సహాయ సహకారాలు ఎంతో ఉందన్న విషయం తెలిసిందే . బహుశ అందువల్లనే ఈ హీరోయిన్ టర్న్డ్ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ .., మహేష్ బాబుని ఆకశానికి ఎత్తేసిందని ఇండస్ట్రి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి .

Share.

Comments are closed.

%d bloggers like this: