సైరా మెగా ఈవెంట్ క్యాన్సిల్.. పోస్ట్ పోన్.. ఇది ప్లస్ ఆ..? మైనస్ ఆ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా స్టార్ చిరంజీవి తన 150 వ చిత్రం తరువాతా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమితాబ్ బచ్చన్ విజయ్ సేతుపతి వంటి మెగా తారాలతో కలిసి నటించించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతుంది. చిత్ర యూనిట్ కూడా మరో హిట్ కన్ఫామ్ అయినట్టు భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాకి ప్రామిసింగ్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నాడు.. ఇందులో భాగంగా ఈ నెల 18 న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో గ్రాండ్ ఈవెంట్ చేయాలనీ భావించి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించాడు. కేటీఆర్ ని కూడా పిలువగా ఆయనకి కుదరకపోడంతో ఆయన రావట్లేదాని చిత్రా యూనిట్ అప్డేట్ ఇచ్చింది.. అంతా బాగుంది ఈవెంట్ కన్ఫామ్ అయ్యింది అనుకునే లోపు వాతావరణం అడ్డుపడింది. 18 న హైదరబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని తేలింది.. మరి ఈవెంట్ ఎలా..? అని డౌట్ గా ఉంది కదూ..

18 న ఎల్బీ స్టేడియం లో ఈ ఈవెంట్ జరగనుంది.. ఎల్బీ స్టేడియం ఓపెన్ గా ఉంటుంది.. వర్షం పడితే ఈవెంట్ ఫ్లాప్ అవుతుందని భావించి ఈవెంట్ ని ఆ రోజుకి క్యాన్సిల్ చేసుకున్నారు. ఈవెంట్ ని ఆదివారం 22 న ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. అభిమానులు కూడా ఆదివారం నాడు ఇంట్లోనే ఉంటారు.. అలాంటి టైమ్ ని క్యాష్ ఇన్ చేసుకుంటే బాగుంటుందని.. వర్షం కూడా పడదు ఈవెంట్ సక్సెస్ ఫుల్ అవుతుందని రామ్ చరణ్ అనుకుంటున్నాడట..! ఇందుకు గాను సన్నాహాలు చేస్తునట్టు సమాచారం.. మరికొంతసేపట్లో అధికారికంగా వార్తని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందని తెలుస్తుంది.. మొత్తానికి రామ్ చరణ్ మంచి ఆలోచనే చేశాడు అని చిరు అభిమానులు కూడా అనుకుంటారు. ఈ విషయం ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే చిత్రా యూనిట్ అధికారిక ప్రకటన చేసేంతవరకు వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: