బాబు పై నిప్పులు చెరిగిన నాని..! ముద్దాయి నువ్వే అని త్వరలో తేలుతుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ హటాత్తుగా ఆత్మహత్యకి పాల్పడటంతో రాజకీయంగా పెను దుమారం రేగింది. గత కొన్ని రోజులుగా ఆయన పై అనేక ఆరోపణలు విమర్శలు వచ్చాయి. దాంతో ఆయన తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆత్మహత్యకి కూడా అదే కారణం కావొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరో పక్క ఆయనది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ వాళ్ళు టీడీపీ పార్టీ పై ఆరోపణలు చేస్తుంటే టీడీపీ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ పై ఆరోపణలు చేస్తున్నారు.. నిజనిజాలు బయటకి రాకముందే స్టేట్ మెంట్లు పాస్ చేస్తున్నారు. తరచూ చంద్రబాబు పై నిప్పులు చెరిగే వైసీపీ నేత మంత్రి కొడాలి నాని ఈ విషయం లోనూ ఆయనని మధ్యలోకి తీసుకొస్తున్నారు. చంద్రబాబు పై తీవ్ర ఆరోపణలు వ్యాఖ్యలు చేస్తున్నారు.. చంద్రబాబు ఓ జిత్తుల మారి నక్క అని ఆయన అంటున్నారు. కోడెల శివప్రసాద్ మృతిపై సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబునాయుడు ముద్దాయి అని తేలుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

నేడు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కోడెల మృతి ఘటనపై విచారణకు కమిటీ వేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కనుక, తమ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని చంద్రబాబు అడుగుతున్నారని, తాము కూడా అదే అడుగుతున్నామని అన్నారు. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అవతలి పార్టీ వాళ్ళు ఏదో అంటే ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరని.. సొంతింటి మనుషులు భార్యో, తండ్రో, కొడుకో.. ఏదో అంటే భావోద్వేగానికి గురయ్యి ఇలాంటి పనులు చేస్తారని ఆయన వ్యాక్యానించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: