చిరంజీవి ఆఫీసు ముందు రచ్చ…! ఉయ్యాలవాడ కుటుంబం అరెస్ట్ …!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక చరిత్రను సినిమాగా డాక్యుమెంట్ చేయాలనుకున్నప్పుడు, ఆ చరిత్ర తాలూకు హక్కుదారుల ఆమోదం పొందడం తప్పనిసరి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి తొలి స్వాతంత్ర సమరయోధుడి కథను సినిమాగా తీసి ఆయనకు సమాజంలో సరైన గుర్తింపు ఇవ్వాలనుకున్న చిరంజీవి అండ్ ప్రొడక్షన్ టీమ్.. ఉయ్యాలవాడ వారసులను మాత్రం పట్టించుకోవడంలేదని ఈ రోజు వచ్చిన వార్త చూస్తే అర్ధమవుతుంది .

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ తాలూకా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఐదో తరం వారసులకు చిరు కుటుంబంలో గతంలో రూ.5 కోట్లు ఇస్తామని చెప్పి.. అగ్రిమెంట్ తో పాటు నోటరీ కూడా చేసి ఇచ్చారని.. ఇప్పటివరకూ న్యాయం చేయలేదంటూ నిరసన చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో రెండు..మూడుసార్లు ఈ వివాదం తెర మీదకు వచ్చింది. తాజాగా ఉయ్యాలవాడ వంశీకులకు చెందిన కొందరు జూబ్లీహిల్స్ లోని కొణిదల ప్రొడక్షన్స్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో..పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఉయ్యాలవాడ వారసుల కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లడుతూ, గతంలో చిరంజీవి ఆఫీసు ఇంచార్జ్ స్వామి నాయుడు, రామ్ చరణ్ పిఏ అవినాష్ మమ్మల్ని పిలిపించి ఉయ్యాల వాడ కుటుంబస్తులైన 22మందికి 5 కోట్ల రూపాయలు ఇస్తామని, నోటరి రాసిచ్చారని, ఇప్పుడు సినిమా విడుదలకి దేగ్గరవుతున్నా.. ఇంకా మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాపోయ్యారు. అసలు మాకు అడిగే హక్కులు కూడా లేవని, చిరంజీవి ఆఫీసు స్టాఫ్ మమ్మల్ని పోలీసులకి అప్పగించారని మొరపెట్టుకున్నారు. ఏది ఏమైనా, సినిమా అంటే బిజినెస్…. ఉయ్యాలవాడ వంటి మహానుబావుని సినిమాను తీసి బిజినెస్ చేసుకోవాలని తపిస్తున్నవారు, ఇచ్చిన మాట ప్రకారం వారి కుటుంబాలకు దక్కాల్సిన డబ్బు ఇచ్చి కనీస గౌరవం ఇవ్వాలని నేటిజన్స్ బావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: