ఇదో వింత..! ఎడ్ల బండికి చలాన్ వేసిన పోలీసులు..! ఆగ్రహం లో రైతులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా వాహనదారులు ముప్పతిప్పలు పడుతున్నారు. చలాన్ల ధరలు ఆకాశాన్ని అంటేసరికి వాహనదారులకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కొత్త ట్రాఫిక్ నిబంధనలు..ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు. చలాన్లు కట్టలేక వాళ్ళు తమ సొంత ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి.. మరి కొందరైతే చలాన్లు కట్టలేక మమ్మల్ని జైలుకి తీసుకెళ్ళండి అని ప్రాదేహపడుతున్నారు. సహనం కోల్పోయి పోలీసులపై ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఉత్తరాఖండ్ లో వింతగా ఓ ఎడ్ల బండికి చలాన్ వేశారు. ఎడ్లబండి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిందంటూ వెయ్యి రూపాయల చలాన్ విదించారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో చార్బా గ్రామానికి చెందిన రియాజ్‌ హసన్‌ అనే ఎడ్ల బండి యజమాని ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించాడంటూ అతనికి వెయ్యి రూపాయల చలాన్ విదించారు. అయితే వాహన చట్టంలో ఎడ్లబండికి చలానా విధించే నిబంధన లేదని తెలుసుకున్న పోలీసుల చాలాన్ రద్దు చేశారు.. అప్పటికే ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రెండు మోటార్‌ సైకిళ్లను తగులబెట్టారు. భారీ చలాన్లపై రైతులు సోమవారం రోడ్డెక్కడంతో నిరసన హింసాత్మకంగా మారింది. ప్రజల పొట్ట నింపడానికి రాత్రింబవళ్ళు మేము కష్టపడుతుంటే పోలీసులు ఆఘాయిత్యాలు చేస్తున్నారు అక్రమంగా చలాన్లు విడిస్తున్నారు అని వారు నిరసనలు చేపడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: