వాకింగ్ కి వెళ్ళిన టీఆర్ఎస్ నేత పై కత్తులతో దాడి..! పరిస్థితి విషమం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వరంగల్ జిల్లా నర్సంపేట లో దుండగులు హల్ చల్ చేశారు..బుధవారం ఉదయం వాకింగ్ కి అని బయలుదేరిన టీఆర్ఎస్ నేత పై కత్తులతో దాడి చేశారు. టీఆర్ఎస్ నేత పై అతని భార్య పై దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు.. బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాధితులు ఇద్దరు వరంగల్ ఎం‌జీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. వరంగాల రూరల్ జిల్లా నర్సంపేటకి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వెంకన్న తన భార్యతో బుధవారం నాడు తెల్లవారుజామున వాకింగ్ కి అని బయలుదేరాడు. పార్క్ లో వాకింగ్ చేస్తున్న సమయం లో అక్కడికి వచ్చిన పలువురు దుండగులు అతని పై మారణాయుధాలతో దాడి చేశారు. దుండగులని అడ్డగించడానికి వెళ్ళిన అతడి భార్య పై కూడా దుండగులు దాడి చేశారు. పార్క్ లోని వాకర్స్ అప్రమత్తమై ఘటన జరుగుతున్న ప్రదేశానికి చేరుకునే లోపు దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి విచారణ చేస్తుండగా ఇది పాత తగాదా అని తేలింది. ఎప్పటినుండో ప్లాన్ చేసుకొని దుండగులు ఈ ఘటనకి పాల్పడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఇద్దరు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకన్న పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: