క్షోభకి గురిచేశారు..ప్రాణం తీశారు..! అంతా గుర్తు పెట్టుకుంటా- బాబు ఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోడెల ని మానసికంగా శారీరికంగా హింసించారని అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయనని ఆత్మహత్య చేసుకునే వరకు ప్రభుత్వం ఊరుకోలేదని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. లక్ష రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ గురించి సెక్షన్ 409 కింద కేసు పెట్టి పదేళ్ళు జైలు శిక్ష పడేలా చేశారని ఆయన గుర్తు చేశారు.. ఒకదాని వెంట మరో కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చారని ఈ వార్తాలని వల్ల సాక్షి మీడియా ద్వారా హైలేట్ చేశారని బాబు అన్నారు.. సాక్షి ఛానల్ లో కోడెలని టార్గెట్ చేస్తూ పడే పడే చూపిఓంచడం వల్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారని అన్నిటిని గుర్తు పెట్టుకుంటామని బాబు ఎద్దేవా చేశారు.

ఫర్నిచర్ గురించి మాట్లాడినా బాబు.. ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం నగదు రూపంలో గాని ఫర్నిచర్ రూపం లో గాని ఇవ్వడం ఆనవాయతి అని అదే తరహాలో కోడెలకి ఫర్నిచర్ ఇచ్చిందని బాబు స్పష్టం తెలిపారు. అప్పటికీ కోడెల పర్మిషన్ తీసుకుంటూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని ఆయన గుర్తు చేశారు.. దాన్నో క్రైమ్ లా చూపిస్తూ మీడియా ని అడ్డుపెట్టుకొని జగన్ కోడెలని మానసిక క్షోభ కి గురిచేశారని బాబు తెలిపారు. కోడెలని అరెస్ట్ చేసినప్పుడు తన న్యావాది జిల్లా ఎస్పీ ని పోలీస్ స్టేషన్ లోని పోలీసులని సెక్షన్ 41,41 ఏ కింద బెయిల్ ఇవ్వమని కోరినప్పటికీ పోలీసులు నిరాకరించారని దురుసుగా వ్యవహరించారని బాబు ఎద్దేవా చేశారు. కోడెల కేసుని సీబీఐ విచారణ జరపాలని కోరుతునట్టుగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణ నిమిత్తం ఒక్కొక్కటి బయటపడుతుందని ఆయన మరణానికి కారణం అయిన ప్రతీ ఒక్కరినీ చట్టం ముందు ముద్దాయిగా నిలబెడతానని బాబు సవాల్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: