వరుణ్ తేజ్ VS హరీష్ శంకర్..! వాల్మీకీ క్రెడిట్ ఎవరిది..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ఫ్యామిలీ హీరోల్లో కొంచం కంటెంట్ ఉండే సినిమాలు ఎంపిక చేసుకుంటాడన్న పేరున్న హీరోల్లో రామ్ చరణ్ తరువాత వరుణ్ తేజ్ ఒక్కడే. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా, అనవసరపు కమర్షియల్ మ్యానరిజమ్స్ జోలికి వెళ్ళకుండా, ప్రతి సినిమాలో కేవలం తానొక పాత్రగా మాత్రమె నటిస్తుంటాడు వరుణ్ తేజ్. కాని ఎందుకో వరుణ్ కి ఇప్పటివరకు దక్కాల్సిన ఇమేజ్ మాత్రం దక్కలేదని చెప్పొచ్చు . వరుణ్ రీసెంట్ హిట్ ‘ ఎఫ్ 2 ‘ లో మంచి నటన కనబరిచి, సూపర్ సక్సెస్ కొట్టినా క్రెడిట్ మొత్తం వెంకటేష్ కామెడి టైమింగ్ లాగేసుకుపాయింది.

ఇక ‘ ఫిదా ‘ తో ఓవర్సీస్ మార్కెట్ దుమ్ముదులిపినా, హీరోయిన్ సాయి పల్లవి కి వచ్చినంత పేరు రాలేదు. ఇక ‘ కంచే ‘ వంటి ఐకానిక్ ఫిలిం చేసినా, వరుణ్ పెర్ఫామెన్స్ కి క్రిటికల్లి హై అప్లాజ్ వచ్చినా , అల్టిమేట్ క్రెడిట్ ని మాత్రం డైరెక్టర్ క్రిష్ తీసుకెళ్ళిపోయాడు. ఇలా మంచి కథలను ఎంచుకుంటూ సక్సెస్ లు కొడుతున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మరోమేట్టు ఎక్కి, నెగిటీవ్ షేడ్స్ ఉన్న వాల్మీకి చిత్రం చేయడం డేరింగ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు .

వాల్మీకి ట్రైలర్స్, టిజర్స్ లో వరుణ్ కిర్రాక్ లుక్స్ తో ఆదరగోడుతున్నాడు. డైరెక్టర్ హరీష్ కూడా సక్సెస్ పై పక్కా నమ్మకంతో ఉన్నాడు …వరుణ్ పవన్ కళ్యాణ్ కంటే కూడా బెస్ట్ యాక్టర్ అన్నంత లెవెల్లో స్టేట్మెంట్లు ఇవ్వడంతో వరుణ్ పై మెగా అభిమానుల అంచనాలు పీక్స్ కి చేరాయి. వాల్మీకి మాత్రుకమైన జిగర్ తాండలో వరుణ్ పాత్రను పోషించిన బాబి సింహ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ కి యావత్ తమిళ తంబీ లు హర్షం వ్యక్తం చేయగా, ఇక్కడ ఆల్రెడీ హీరో అయినటువంటి వరుణ్ నుంచి అంతకుమించిన పర్ఫర్మేన్సుని ఎక్స్ పెక్ట్ చేస్తారు తెలుగు జనాలు…

అందుకే వరుణ్ కెరీర్ కి వాల్మీకి ఒకరకంగా అగ్ని పరీక్ష లాంటిది. తేడా కొడితే సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరోకు ఇలాంటి కథలు ఎందుకు అనే కామెంట్స్ వస్తాయి. హిట్ అయితే ముందు హరీష్ శంకర్ పేరు లాగేసుకోవడానికి ట్రై చేస్తాడు. అందుకే ఒకవేళ వాల్మీకి సినిమా హిట్ అవుతే మాత్రం క్రెడిట్ కోసం, వరుణ్ తేజ్ హరీష్ శంకర్ ల మధ్యలో వార్ నడిచేలనే ఉంది. అప్పుడు సక్సెస్ క్రెడిట్ ఫైట్ లో ఎవరు నేగ్గుతారో చూడాల్సిన అంశమే. మైక్ కనిపిస్తే నమిలేసే హరీష్ ముందర, అద్దిరిపోయే స్పీచ్ లు దంచటంలో కొంచం వీక్ అయిన వరుణ్ నిలదొక్కుకుని ఎలా క్రెడిట్ తీసుకుంటాడు అన్న విదానంలోనే వరుణ్ నెక్స్ట్ మూవీస్ సెలెక్షన్ ఆదారపడి ఉంటుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: