జబర్దస్త్ కి రోజా దూరం..! నాగబాబు ఒంటరి అయిపోతాడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కొన్ని సంవత్సరాలుగా తెలుగు బుల్లి తెరను ఏలుతున్న కామెడి షో జబర్దస్త్. ఎంతోమంది పార్టీసిపెంట్స్, కెప్టన్ లు మారినా.. జడ్జిలుగా మాత్రం రోజా నాగబాబులు వెళ్ళిపోకుండా జబర్దస్త్ బ్రాండ్ ని కాపాడుకుంటూ వస్తున్నారు . ఎన్నికల కారణంతో అక్కడక్కడ ఇద్దరికీ అప్పట్లో చిన్న చిన్న గ్యాప్ లు వచ్చినా మళ్లీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుండటం పలు అనుమానాలకి దారి తీస్తుంది. ఏ వారం ఎవరు కనిపిస్తారో, ఎవరు డుమ్మా కొడతారో అర్ధంకాని అయోమయ పరిస్థితి జబర్దస్త్ లో నెలకొంది.

ఈ వారం కనిపించిన జడ్జిలే వచ్చే వారం కనిపించడం లేదు. కొన్ని వారాలుగా రోజా, నాగబాబు వచ్చినా కానీ మళ్లీ ఈ వారం రోజా మిస్ అయింది. అయితే వైఎస్ జగన్ కేబినెట్ లో గౌరవ హోదాలో బిజీ అయిపోయిన రోజా, జబర్దస్త్ కి సమయం కేటాయించలేక, మెల్లి మెల్లిగా దూరం అవుతుందా, ఒకేసారి వెళ్ళిపోకుండా ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారా.. అంటూ కొన్ని వదంతులు వస్తున్నాయి. అందుకే సోలోగా నాగబాబు జడ్జిమెంట్ ఇవ్వక తప్పట్లేదు. కాకపోతే ఈ మిస్సింగ్‌ను ఈ వారం వరుణ్ తేజ్, హరీష్ శంకర్‌తో కవర్ చేసారు. ఏది ఏమైనా జబర్దస్త్ స్టేజికి వన్నె తెచ్చిన నాగబాబు, రోజా జడ్జీలుగా జడ్జిమెంటు ఇస్తేనే కిక్ ఉంటుంది అని, అందుకే జబర్దస్త్ ఉన్నంత వరకు ఇద్దరు కలిసే జడ్జీలుగా ఉండాలని వ్యూవర్స్ కోరుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: