చవక ప్రాడక్ట్ వాడింది..! చావు అంచులకి వెళ్లింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ముఖం పై మచ్చలు వచ్చాయని ఫేస్ క్రీమ్ రాసుకుంది.. ఇక అంతే సంగతులు..! జరిగిన పరిణామం ఎక్కడా చూసుండరూ.. కనీసం వినుండరు..! అందరూ ఎక్స్ పెక్ట్ చేసే చమత్కారం ఏమి జరుగలేదు ప్రపంచం అంతా మాట్లాడుకోబోయే చోద్యం జరిగింది. ఫేస్ క్రీమ్ రాసుకున్న పాపాన కోమా లోకి వెళ్లింది.. కోమాకి వెళ్ళి మూడు నెలలు అవుతున్నా ఇంకా తేరుకోలేదు. రాసాయన లోపాల కారణంగా ఇలా జరిగిందని మెడికల్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరుగలేదని ఇలా జరగడం ఇదే తొలిసారి అని వైద్యులు పేర్కొంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ 47 ఏళ్ల మహిళ జులై మాసంలో తన ముఖం మీద మచ్చలు వస్తున్నాయని అందుకోసం ఫేస్ క్రీమ్ పెట్టాలని డిసైడ్ అయ్యి ఓ ఫేస్ క్రీమ్ ని ఆర్డర్ చేసింది. ఆ ఫేస్ క్రీమ్ మెక్సికో లో అయితే తక్కువకి దొరుకుతుందని భావించి అక్కడ నుండి ఆర్డర్ చేసింది. ఫేస్ క్రీమ్ ముఖానికి అప్లై చేసుకున్న తరువాత కొంత సేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకి గురయ్యింది. స్పృహ కోల్పోయింది.. దీన్ని గమనించిన ఇంటి సభ్యులు ఆమెని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు.

ఆ ఫేస్ క్రీమ్ పెత్త్కున్న తరువాత ఇలా జరిగేసరికి వైద్యులు దాన్ని పరిశీలించారు. పరీక్షలకి పంపించారు.. పరీక్షల్లో వెల్లడైన రిజల్ట్స్ చూసి వైద్యులు కంగు తిన్నారు.. ఆ ఫేస్ క్రీమ్ ని థర్డ్ పార్టీ వాళ్ళు కల్తీ చేశారని ఆ ఫేస్ క్రీమ్ లో మిథైల్ మెర్క్యురీ శాతం ఎక్కువ ఉండటం వల్లనే ఆ మహిళ కి అస్వస్థత కలిగిందని వెల్లడించారు. చికిత్స పొందుతున్న మహిళ రసాయన శాతం ఎక్కువ అయ్యేసరికి ముందు మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy)కి గురయ్యింది.. అనంతరం ఆమె కోమా లోకి జారుకుంది. ఈ ఘటన జరిగి మూడు నెలలు పూర్తవ్వోస్తున్నా ఆ మహిళా మాత్రం ఇంకా కోమా నుండి తేరుకోలేక పోయింది. డాక్టర్లు మాత్రం చావకగా వస్తుందని తప్పుడు ప్రాడక్ట్ కొనిందని ఆ ప్రాడక్ట్ ని థర్డ్ పార్టీ వాళ్ళు కల్తీ చేశారని తెలిపారు.. ఆ కల్తీ ఫేస్ క్రీమ్ వాడినందుకే ఆ మహిళా కోమా లోకి వెల్లిందని వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: