సైరా క్లైమాక్స్ లీక్…ఊహకందని ట్విస్ట్ అంటే ఇదే…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రతి సినిమాకి క్లైమక్స్ గుండెకాయ లాంటిది . ఒక సినిమా హిట్టా ఫ్లాపా లేక యావరేజా…, అని తేల్చేది క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రమె . సినిమా ఆద్యంతం యావరేజ్ నరేషన్ తో సాగాదిసిన , క్లైమాక్స్ గ్రిప్పింగ్ గా ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అవ్వొచ్చు. ఒకవేళ సినిమా అంత బావుండి, క్లైమాక్స్ తేడ కొడితే బాక్స్ ఆఫీస్ దెగ్గర సినిమా బోల్త కొట్టే డేంజర్ కూడా ఉంటుంది. అందుకే చిత్ర దర్శక నిర్మాతలు క్లైమాక్స్ విషయంలో ఎంతో చేమటోడుస్తూ ఉంటారు. ముక్యంగా టాలివుడ్ దర్శక హీరోలు క్లైమాక్స్ పై ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటుంటారు. మన టాలివుడ్ స్క్రీన్ ప్లే ఫార్ముల ప్రకారం స్యాడ్ ఎండింగ్స్ మనకి అంతగా వర్కౌట్ అవ్వవని, మన తెలుగు హీరో చనిపోతే ప్రజలు జీర్నిన్చుకొలేరని, ఎలాగైనా హీరోను బ్రతికించి హ్యాపీ ఎండింగ్ నే అందిస్తుంటారు మన టాలివుడ్ దర్శకులు. ఇప్పుడు సరిగ్గా ఇదే పాయింట్ సైరా విషయంలో తీవ్ర చర్చకు దారి తీస్తుంది.

ఎప్పుడైతే మెగా స్టార్ సైరా మూవీ అనౌన్స్ చేసాడో అప్పటి నుండి అందరు అసలేవరు ఈ సైరా నరసింహ రెడ్డి అంటూ, ఆయన చరిత్రను నెట్లో తెగ సర్చ్ చేయడం జరుగుతుంది. ఈ వీరుడి కథ చివరి వరకు చదివిన అందరి గుండెలు బరువేక్కడం కాయం, ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డి తల నరికి చంపి ఉరి తీసి.. మరణించిన అనంతరం తలను కోట గుమ్మానికి వ్రేలాడదీశారు. దేశం మొత్తం ఒక్కసారిగా బయంతో ఉలిక్కిపడ్డ ఈ దుర్ఘటనను తెర పై ఎలా చూపిస్తారు అనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తి గా మారింది. ఈ క్లైమక్స్ ఎపిసోడ్లో మెగాస్టార్ని అలా చూసి అభిమానులు జీర్ణించుకోగలరా.. అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఒకవేళ మెగా స్టార్ ఇమేజి దృష్ట్యా ఆ కథలో మార్పులు చేస్తే, నరసింహ రెడ్డి బయో పిక్ కి న్యాయం జరగదేమో అని బయపడుతున్నారు మూవీ మేకర్స్.

కాని విశ్వసనీయ సమాచారం ప్రకారం, చిరంజీవి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. నా ఇమేజిని దృష్టిలో పెట్టుకొని కథను మార్చొద్దు … మారిన ట్రెండ్ దృష్ట్యా రియలిస్టిక్ కథలనే ఆదరిస్తున్న అభిమానుల కోసం, నరసింహ రెడ్డి జీవితంలో ఎం జరిగిందో క్లైమాక్స్ లో కూడా దాన్నే చూపించాలని సురేందర్ రెడ్డికి ఆదేశించారట. ఈ వార్త విన్న అభిమానులు ఇప్పుడు దట్ ఈజ్ మెగా స్టార్ అంటున్నారు. అంత పెద్ద స్టార్ హీరోగా వెలుగొందుతున్నా ,ఇంతటి డేరింగ్ డెసిషన్ తీసుకోని సినిమాలపై తన ప్యాషన్ ఎలాంటిదో తెలుగు ప్రేక్షకులకి మరోసారి చుపెట్టబోతున్నాడు మెగా స్టార్ చిరంజీవి .

Share.

Comments are closed.

%d bloggers like this: