జనసేన ట్విట్టర్ అకౌంట్స్ బ్లాక్..బగ్గుమన్న పవన్ కళ్యాణ్ …!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిన తరువాత మరింత దూకుడు పెంచింది జనసేన పార్టీ . క్రితం సంవత్సరంతో పోలిస్తే ప్రజాసమస్యలపై పోరాటంలో ప్రతిపక్షమైన టిడిపికి సరిసమానంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇందులో పవన్ కళ్యాణ్ సందేశాలను ముందుకు తీసుకెళ్ళడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ వస్తుంది జనసేన సోషల్ మీడియా శతగ్ని టీం . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య వచ్చిన ట్విట్టర్ వేదికగా, జనసైనికులని కథన రంగంలోకి దింపుతూ సమస్యలను ప్రజలకు చేరువచేస్తున్నారు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా టీం . అందుకే నిత్యం పవన్ పెట్టే ట్వీట్ల కోసం ఎందరో ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు కూడా మద్దతు దార్లు, అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటి పవన్ అభిమానులు, జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేసింది ట్విట్టర్ యాజమాన్యం .

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్ పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్ పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్ పీకే వంటి ఖాతాలను సస్పెండ్ చేసింది ట్విట్టర్. ఈ ఊహించని పరిణామాలపై పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందిచటం జరిగింది . “జనసేనకు మద్దతుగా ఉన్న 400 ట్విట్టర్ అకౌంట్లు ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదు. నిస్సహాయులు, వారి సమస్యల్ని తెలుసుకొని అండగా నిలబడటం దీనికి కారణమా.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి “ అంటూ పవన్ ప్రశ్నించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం కొన్ని మీడియా సంస్థలను నిలిపేసి, వారికి అనుకూల పత్రికలనే బ్రతకనిస్తున్న సమయంలో , జనసేన ట్విట్టర్ అకౌంట్స్ ని కూడా వై ఎస్ అర్సిపి వాల్లె బ్లాక్ చేపించి ఉంటారని జన సైనికులు ఆరోపిస్తున్నారు . జనసేనను చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతోందంటున్నారు జనసేన కార్యకర్తలు. ఇక ఈ వ్యవహారంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించడంతో రాజకీయంగా హీట్ ని పెంచుతుంది .

Share.

Comments are closed.

%d bloggers like this: