వివాదాల ‘దాస్’ పై నాని షాకింగ్ నిర్ణయం ….!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ ఫలక్ నుమా దాస్’ తో కంటెంట్ ఉన్న హీరో అనే పేరుతో పాటు కాంట్రవర్సిస్ ని కూడా కొని తెచ్చుకున్నాడు ఈ యువ హీరో విశ్వక్ సేన్ . ఓపెన్ ప్లాట్ ఫార్మ్స్ పై బూతులు మాట్లడుతూ అప్పట్లో పెను సంచలనాలనే క్రియేట్ చేసాడు విశ్వక్ . అలాంటి ఫైర్ బ్రాండ్ హీరోతో కూల్ అండ్ కామ్ నాని వర్క్ చేయబోతున్నాడట . న్యాచురల్ స్టార్ నాని హీరోగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ‘అ!’ సినిమా నిర్మించాడు. సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కాయి. ఆ సినిమా తర్వాత కొన్ని స్మాల్ బడ్జెట్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించాడు. తాజాగా నాని నెక్స్ట్ ప్రొడక్షన్లో విశ్వక్ సేన్ తో ప్లాన్ చేస్తున్నాడట నాని.
డైరెక్టర్ ఎవరు.. కథ ఎలాంటిది అనే వివరాలు తెలియదు కానీ త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. విశ్వక్ సేన్ నటుడిగా మంచి మార్కులే తెచ్చుకున్నా ‘ఫలక్ నుమా దాస్’ ప్రమోషన్స్ సమయంలో చేసిన హంగామా అందరికీ గుర్తుంది. పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో బూతులు వాడడంపై తీవ్రంగా విమర్శలు చెలరేగాయి. అయితే అలాంటివాటిని ఏమాత్రం పట్టించుకోకుండా విశ్వక్ తో నాని ఒక సినిమాను నిర్మించడానికి రెడీ కావడం అందరినీ ఆకర్షిస్తోంది

Share.

Comments are closed.

%d bloggers like this: