“సైరా” ట్రైలర్ రివ్యూ ….!

Google+ Pinterest LinkedIn Tumblr +

అత్యంత బారి అంచనాల నడుమ ‘ సైరా ‘ ట్రైలర్ ని లాంచ్ చేసాడు నిర్మాత రామ్ చరణ్ . రోమాలు నిక్కపొడిచే విదంగా సాగే ఈ ట్రైలర్ లో మెగా స్టార్ చిరంజీవి నట విశ్వరూపం కనబరిచారు. ఆరుపదుల వయసులో చిరంజీవి చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పటి యువ హీరోలకి ఇన్సిపిరేషన్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పోరాట యోధుడు నరసింహ రెడ్డి పాత్రలో చిరంజీవి లుక్స్ అండ్ స్టంట్స్ అత్యద్బుతం అంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ట్రైలర్ మొదలవ్వడమే ‘భారతమాతకి…జై’ అంటూ స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమాలో భారతమాత స్వాతంత్య్రం గురించి పోరాడిన ఒక యోధుడి గురించి చెబుతున్నప్పుడు ఆ యోధుడి గురించి కాకుండా అతని ఆశయం గురించి చెప్పడం అనే సెన్సిబిల్ పాయింట్‌తో ట్రైలర్ కట్ చేసిన సురేందర్ రెడ్డి అక్కడే పూర్తిగా పాస్ మార్క్స్ వేయించుకున్నాడు. నరసింహ రెడ్డి గురువు ‘ గోసాయి వెంకన్న’ పాత్రలో అమితాబ్ బచ్చన్, నరసింహ రెడ్డి ధర్మపత్ని ‘ సిద్దమ్మ ‘ పాత్రలో ‘ నయన్ తార’ లు పర్ఫెక్ట్ ఆప్ట్ అయ్యారని చెప్పొచ్చు . ఇక ఎందరో హాలివుడ్ టెక్నీషియన్స్ పని చేసిన ‘ సైరా ‘ను ఒక విజువల్ వండర్ లా.. హాలి వుడ్ స్తాయిలో చిత్రీకరించాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కేవలం యోధుడు మాత్రమే కాదు, ఒక యోగి అని చూపించిన విధానం ఈ సినిమాలో ఎంత డీటైలింగ్ వర్క్ ఉంది అనేదానికి ఉదాహరణ.

Share.

Comments are closed.

%d bloggers like this: