సైరా పై సెటైర్స్…! ఆందోళనలో మెగా ఫ్యామిలీ…?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, మహానుభావుడి చరిత్రను సినిమా ద్వారా డాక్యుమెంట్ చేయాలనుకున్నప్పుడు మేకింగ్, టేకింగ్ పరంగా కొన్ని స్టాండెర్డ్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాలంలో ఆ కథ అలానే నిజంగా జరిగిందేమో అన్న పంథాలో రియలిస్టిక్ గా షూట్ చేయాలి. లెజెండ్స్ యొక్క బయో పిక్ సినిమాల్లో కూడా అదే రోడ్ద కొట్టుడు మాస్ ఫార్ములాస్ ని ఉపయోగిస్తే ఆ సినిమా చరిత్రకారుల బయో గ్రఫీ అనిపించుకోదు. అది కూడా ఒక రొటీన్ కమర్షియల్ సినిమాగానే ప్రేక్షకులకి అనిపించే డేంజర్ ఉంటుది. ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘ సైరా ‘ ట్రైలర్ చేస్తే ఇలాంటి అనుమానాలు కలుగక మానవు. సినిమాపై నెలకొన్న భారి అంచనాలను ఈ ట్రైలర్ అందుకుందా అంటే… అభిమానుల వరకు ఈ ట్రైలర్ ఓకే అనిపించినా, సామాన్య ప్రేక్షకులకి మాత్రం రొటీన్ మాస్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ వస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని కూడా నేటిజన్స్ ఎత్తి చుపుతున్నారు.

ఉయ్యాలవాడ పాత్రను వీలైనంత న్యాచురల్ గా చుపెట్టకుండా, బాహుబలి లోని రాజుల వలె కాస్ట్యూమ్స్ వాడారని, నరసింహ రెడ్డి ఒక సమాన్య కుటుంబం నుండి వచ్చిన స్వాతంత్ర పోరాట యోధుడని మరిచి, చిరంజీవి ఇమేజ్ కోసం సైరా నరసింహ రెడ్డి గెట్ అప్ ని పాడు చేసారని విమర్శలు వస్తున్నాయి. ఒక యోధుడు.. రణరంగంలో శత్రువులకు వెన్నులో వణుకు తెప్పిస్తాడు అనే తరహాలో ఇంట్రో ఇవ్వడం వరకూ ఒకే కానీ ‘కారణ జన్ముడు’.. ‘యోగి’ అనే పదాలను వాడడం చూస్తే ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో ఎన్టీఆర్ పాత్రను దైవాంశ సంభూతుడిగా చూపించేందుకు చేసిన విఫల ప్రయత్నం గుర్తొస్తోందనే మరో పాయింట్ చర్చకోస్తుంది.

సాధారణంగా మెగా స్టార్ మూవీ అంటే మాస్ ఎంటర్ టైనర్ అని పేరు ఉంది. ఎలాంటి కథనైన కమర్షియల్ ఫార్ములలో ఇమడ్చి ప్రేక్షకులకి అందించే చిరంజీవి, ఈ సైరా కథను కూడా కమర్షియల్ ఫార్మేట్ లో ఇరికించాలని చూస్తూ, నరసింహ రెడ్డి పాత్రకున్న సహజత్వాన్ని వదిలేసారన్న అనుమానులు వస్తున్నాయి. ముక్యంగా ఈ ట్రైలర్ లో అభిమానులని అలరించే గ్రాఫిక్స్, యాక్షన్ ఉన్నా, సామాన్యులు అవురా… అనిపించే స్థాయిలో అయితే ఏ విజువల్స్ కూడా లేవని అంటున్నారు నేటిజన్స్. ఇక చిరంజీవి డైలాగ్స్ లో కనిపించే ఇంటెన్సిటి కాకుండా ఈసైరా డైలాగ్స్ ఎదో ఫోర్స్ బుల్ గా చెప్తున్న ఫీలింగ్ వచ్చింది అని ట్రైలర్ చూసిన వీక్షకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా చిరంజీవి తనకు కొట్టిన పిండైన కమర్షియల్ ఫార్మేట్ ని వదిలి చేస్తున్న ఈ రిస్కీ స్టంట్ లో ఇమిడిపోయాడా.., లేదంటే సైరా వంటి ఈ చరిత్రకారుడి కథను కూడా తన కమర్షియల్ ఫార్మేట్ లోకి తెచ్చి పాడుచేసాడా.., అన్నది మనం సైరా విడుదలయ్యాక చూస్తే కాని చెప్పలేం.

Share.

Comments are closed.

%d bloggers like this: