సైరా ఫ్యామిలీనీ మోసం చేసిన మెగా ఫ్యామిలీ..! నేటిజెన్స్ ఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

“ పేకాట క్లబ్బులలో పేదవారి డబ్బులను కాజేయడం అన్యాయం అయినా.., ప్రబుత్వం కొన్ని క్లబ్బులకి లైసెన్స్ లు ఇచ్చి మరి పేకాటను చట్టబద్దం చేసింది “… అందుకే “ నేను న్యాయ బద్దంగా కాదు చట్ట బద్దంగా సంపాదిస్తాను”…, ఈ డైలాగ్స్ అన్ని చిరంజీవి చాలెంజ్ సినిమాలోనివి. అందులో చిరంజీవి, చట్టంలోని లొసుగులను క్యాచ్ చేసుకుంటూ డబ్బు ఎలా సంపదిస్తాడో, ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ కూడా కూడా కోర్టు, చట్టం అని సాకులు చెప్పి నరసింహ రెడ్డి ఫ్యామిలి కి పరిహారం ఇవ్వడం లేదని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ కథను తీస్తున్నందుకు, మాకు తగిన పరిహారం చెల్లించాలని, ఉయ్యాలా కుటుంబస్తులు కొందరు, చిరంజీవి మరియు రామ్ చరణ్ ఆఫీసు ముందర కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటివరకు వారికి రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా, వారిని అరెస్ట్ కూడా చేయించారు. ఈ సంఘటనపై నిర్మాత రామ్ చరణ్ లేటెస్టుగా స్పందించాడు.
“ నేను గతంలో ఉయ్యాల‌వాడ ఫ్యామిలీస్‌ని కలిశాను. వాళ్లతో మాట్లాడాను. ఒక వ్యక్తి జీవిత చరిత్రను తీసేటప్పుడు 100 సంవత్సరాల దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. ఇది నేను చెప్పే మాట కాదు.. గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. 100 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి జీవిత చరిత్రను సినిమా చేసుకోవచ్చిని, ఆ చరిత్రను ఎవరైనా తీయొచ్చని. ఇంకా చెప్పాలంటే ఇటీవల మంగళ్ పాండే అనే గ్రేట్ లీడర్‌పై సినిమా తీసేటప్పుడు కూడా ఇలాంటి వివాదామే నడిచింది. ఆ సందర్భంలో 100 సంవత్సరాలు కాదు.. 65 సంవత్సరాలకే ఇలాంటి వ్యక్తులు జీవితాలను సినిమాగా తీయొచ్చని, కోర్టు చెప్పిందని చరణ్ చెప్పుకొచ్చాడు..” అయితే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి, వేల కోట్ల లాబాలను దండుకునే అవకాశాలున్న సైరా యూనిట్ కి ఈ పేదింటి నరసింహ రెడ్డి కుటుంబాల ఏడుపులు ఎందుకు కనిపించటం లేదు..?

5 కోట్లు ఇస్తామని నోటరీ రాసుకున్న విషయం వాస్తవం కాదా..? వారికి రావాల్సిన డబ్బులనే అడుగుతుంటే కోర్టు పేరు చెప్పి తప్పించుకోవడం ఎంత వరకు సమంజసం..? అని నేటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కోర్టు చట్టం గురించి అంతబాగా తెలిసిన రామ్ చరణ్, సినిమా షూటింగ్ కి ముందర ,నరసింహ రెడ్డి ఫ్యామిలికి డబ్బులు ఇస్తా అని చెప్పడం ఎందుకు, వారిని ఆశల తిరంలో విహరింప చేయడం ఎందుకు, ఇప్పడు డబ్బులు ఇవ్వకుండా వారిని అన్యాయంగా ఇలా తిప్పించుకోవటం సబబేనా..? ఇచ్చిన మాట ప్రకారం కుదుర్చుకున్న నోటరీ ప్రకారం న్యాయ బద్ధంగా డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది, మెగా ఫ్యామిలీకి అయ్యే ఫోన్ బిల్ల్స్ ఖర్చులంత అమౌంట్ ఇవ్వడానికి, అంత పంతం ఎందుకు, ఇంత చిన్న విషయానికి కోర్టలు చట్టంపై నేరం నేట్టేయడం ఎందుకు అన్నది ఎవ్వరికి అర్ధం కాని పరిస్థితి. అయితే కావాలని ఈ ఇష్యుని కాంట్రవర్సి చేసి, ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయాలని సినిమా యూనిట్ ఇలా చేస్తుంది అంటూ నేటిజన్స్ ఎవరికీ తోచిన విదంగా వారు మాట్లాడుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: