తండ్రిది అధికారం..కొడుకుది అహంకారం..ప్రజల ఆగ్రహం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తండ్రి ఎమ్మెల్యే…పైగా అధికార పార్టీకి చెందినవాడు. దీంతో ఏం చేసినా చెల్లుతుందనుకున్నాడో ఏమో గాని ఏకంగా నడిరోడ్డు మీద, అందులోనూ నాలుగు రోడ్ల జంక్షన్‌లో పుట్టిన రోజు వేడుకలు చేసుకొని.. రెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమయ్యాడు వైసీపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేటలో నిన్న రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు తనయుడు వికాస్ పుట్టిన రోజు వేడుకలను అంబాజీపేటలోని ఓ జంక్షన్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యే కొడుకు కావడంతో అనుచరులంతా ఆయన పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బర్త్ డే వేడుకలు నిర్వహించడంతో.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన వారు, స్కూల్ పిల్లలు.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల పట్ల పోలీసులు సైతం సైలెంట్‌గా ఉండిపోయారు. ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అయితే మాత్రం ఇలా ట్రాఫిక్ ను ఆపేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఇంట్లో చేసుకోవాల్సిన వేడుకను ఇలా రోడ్డుపై చేసుకుని తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు విద్యార్థులు కూడా వైసీపీ నేత సుపుత్రుడి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: