సాహోనే ఫస్ట్…సైరాకి నిరాశ….!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టార్ హీరో సినిమాల విడుదల సమయంలో చిత్ర నటి నటిలు, యూనిట్ సభ్యుల కంటే అభిమానుల హడావిడే ఎక్కువ. ఆని యాంగిల్స్ లో తమ హీరోనే మొదటి స్తానంలో ఉండాలని పోటి పడుతుంటారు అభిమానులు. మా హీరో సినిమాకి ఇన్ని కోట్లు అంటే, మా హీరో సినిమా కే ఎక్కువ, మా హీరో సినిమా థియేటర్ల సంఖ్య పెద్దదంటే మాది పెద్దదంటూ ఒకప్పటి ఫ్యాన్స్ కొట్టుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది . సినమా అంతా కూడా డిజిటల్ మయం అయిపోయింది. వ్యూస్ షేర్స్ లైక్స్ అంటూ సరికొత్త నంబర్ గేమ్ తో అభిమానులు పోటిపడుతున్నారు. ఇక ఇండియన్ వైడ్ గా నెగిటీవ్ టాక్ తోనే ప్రభాస్ ‘ సాహో ‘ శ్రుష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఆ సినిమా హడావిడి ముగిసిన కొద్దిరోజులకే మరో ఇండియన్ ప్రెస్టిజియస్ మెగా ఫిలిం సైరా కథనరంగంలోకి దూకింది.

ఈ సినిమా టీజర్‌కే బ్రహ్మాండమయిన రెస్పాన్స్ రావడంతో రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా ఆద్యంతం ఆసక్తికరమయిన అంశాలతో సూపర్‌గా ఉంది. దీంతో ఈ ట్రైలర్‌కి అన్ని భాషలనుండి మంచి స్పందన దక్కింది. విడుదలయిన రెండుగంటల్లోనే 2 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న ‘సైరా’ ట్రైలర్ ఒక్క విషయంలో మాత్రం ‘సాహో’ కంటే వెనుకే నిలిచింది. సైరా సినిమా ట్రైలర్‌కి 40 నిమిషాల్లో లక్ష లైక్స్ వచ్చాయి. కానీ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాకి మాత్రం అంతకంటే తక్కువ టైమ్‌లోనే లక్ష వ్యూస్ వచ్చాయి. కేవలం 27 నిమిషాల్లో లక్ష లైక్స్ దక్కించుకున్న రికార్డ్ మాత్రం సాహో పేరుతో అలానే ఉంది. మళ్ళీ ఏ ‘RRR’ ట్రైలరో వస్తే తప్ప ఆ రికార్డ్ చెరిగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తక్కువ టైమ్‌లో లక్ష లైక్స్ దక్కించుకున్న ట్రైలర్ లిస్ట్‌లో మూడో ప్లేస్ లో నిలిచింది ‘అరవింద సమేత’. ఆసివనిమా ట్రైలర్‌కి 67 నిమిషాల్లో లక్ష లైక్స్ దక్కాయి. ఇక ఆ తరువాతి స్థానంలో నిలిచింది ‘బాహుబలి 2’. బాహుబలి-2 ట్రైలర్‌కి 75 నిమిషాల్లో లక్ష లైక్స్ వచ్చాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: