మిషన్ సూర్య..! ఇస్రో నెక్స్ట్ టార్గెట్..! ప్రత్యేకతలు ఇవే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుడి పై అధ్యాయనం చేసేందుకు చంద్రయాన్ మిషన్ చేపట్టింది. చంద్రయాన్ 2 మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం పై రోవర్ ని లాంచ్ చేసిన ఘనత కేవలం ఇస్రో ది మాత్రమే. ప్రపంచం లోని ఎన్నో పేరుగాంచిన అంతరిక్ష సంస్థలు సైతం చేయలేని పనిని ఇస్రో దాదాపుగా పూర్తి చేసి బేష్ అనిపించుకుంది. చంద్రుడి సౌత్ పోల్ పైకి రోవర్ ని ల్యాండ్ చేసింది.. కానీ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కమ్యూనికేషన్ సిగ్నల్ కోల్పోయింది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో సంచలనాత్మక నిర్ణయం చేసుకుంది. చంద్రుడి పై అధ్యాయనలో 90 శాతం మార్కులు కొట్టిన ఇస్రో ఇప్పుడు సూర్యుడి పై అధ్యాయనం చేయనుంది. సూర్యుడి కక్ష లోకి వ్యోమనౌక పంపనుంది. సూర్యుడి చుట్టూ ఆ వ్యోమనౌక ఏడు ఏళ్ల పాటు తిరిగి అక్కడ కలెక్ట్ చేసిన డేటా ను భూమికి పంపుతుంది.

భూమి పై జీవం పుట్టుకకు మూల కారణం సూర్యుడు. స్యూరుడి సహకారం వల్లే భూమి పై జీవం పుట్టుకొచ్చింది. పైగా భూమికి అత్యంత సమీపమైన తార సూర్యుడు. మన సోలార్ సిస్టెమ్ కి మధ్యమ తార సూర్యుడు. సూర్యుడి పై అధ్యాయనం చేయడం తో తారల యొక్క స్ట్రక్చర్ పూర్తిగా తెలుసుకోవచ్చు. జీవం పుట్టుకకు తార ఎలా ఉపయోగపడుతుందో తెలిస్తే మిగితా సోలార్ సిస్టమ్స్ పై కొన్ని ఊహాగానాలు వేసుకోవచ్చు. భూమి లాంటి ఇతర గ్రహాల జాడ గుర్తించాలన్న జీవం రహస్యం తెలుసుకోవాలన్నా సూర్యుడి పై అధ్యాయనం చేసి తీరాల్సిందే.

ఈ మిషన్ కి ఇస్రో ఆదిత్య-ఎల్1(ఆదిత్య-1) అనీ పేరుని ఖరారు చేసింది. ఇక వచ్చే సమవత్సరం మిషన్ లో భాగంగా శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా భూమికి 800 కి.మీ. ఎత్తులో ఉన్న కక్ష్యలోకి రోవర్ ను వదిలిపెట్టనున్నారు. అక్కడి నుంచి అది సూర్యుడివైపు ప్రయాణిస్తుంది. వ్యోమనౌక బరువు దాదాపు 1500 కిలోలు ఉండొచ్చని అంచనా.. కాగా ఈ మిషన్ మొత్తం బడ్జెట్ దాదాపుగా 1300 కోట్లుగా అంచనా వేస్తున్నారు. సూర్యుడి పై ఎప్పుడు ఒక సరియన ఉషోగ్రత ఉండదు.. అక్కడ జరిగే రసాయనిక మార్పుల ప్రకారం ఊష్ణోగ్రతలు మారుతాయి. రసాయన మార్పులు జరిగే పొరను కరోనా అంటారు. ఈ కరోన పై అధ్యాయనం చేయడమే ఈ మిషన్ ప్రథమ లక్ష్యం.

ఆదిత్య ఎల్-1 భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న కక్ష్యలో ఉండి కరోనాపై పరిశోధనలు చేస్తుంది. దీనిని లాగ్రాంజియాన్ పాయింట్-1 అని పిలుస్తుంటారు. సాధారణంగా రెండు గ్రహాల మధ్య కొన్ని స్థిర కక్ష్యలు ఉంటాయి. వీటినే లాగ్రాంజియాన్ పాయింట్స్ అని కూడా పిలుస్తారు. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న మొదటి స్థిర కక్ష్యలో(ఎల్-1) ఆదిత్య-1 ఉండి పరిశోధనలు చేస్తుంది. దానిలోని పరికరాల సాయంతో కరోనాలో జరిగే మార్పులను అనుక్షణం పరిశీలిస్తుంది. ఇక చంద్రయాన్ 2 తో 90 శాతం మార్కులు కొట్టిన ఇస్రో ఇక సూర్యయాన్ మిషన్ తో ఎన్ని మార్కులు కొట్టనుందో వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: