భగ్గుమన్న యూపీ..! రేప్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిన్మయనంద్ అరెస్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత స్వామి చిన్మయానంద ఎప్పుడూ వివాదాల నడుమనే ఉంటాడు. ఆశ్రమాలు విద్యాసంస్థలు నడుపుతున్న ఈయన తెర వెనుక అక్రమాలకి పాల్పడుతున్నాడని గతం లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఈయన పై 2011 లో నమోదైన రేప్ కేసు అప్పట్లో సంచలనాన్ని రేపింది. స్వామి చిన్మయానంద తన విద్యాసంస్థల్లో ఎంఎల్ చదువుతున్న విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డాడని బ్లాక్ మెయిల్ చేశాడని ఓ యువతి కేసు నమోదు చేసింది. అప్పట్లో ఈ కేసు దుమారాన్ని రేపగా ఇప్పుడు మరోసారి ఈయన పై అలాంటి కేసే నమోదయ్యింది. స్వామీజీ ఆశ్రమం లోనే ఉంటున్న ఓ యువతి గత నెల 24 న ఓ మహిళ తనని స్వామీజీ బ్లాక్ మెయిల్ చేశాడని సంవత్సరం పాటుగా ఆమె పై అత్యాచారం చేస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే ఆ పోస్ట్ వైరల్ అయ్యింది.. పోస్ట్ పెట్టి 10 రోజులు గడుస్తున్నా ఎలాంటి కేసు పెట్టలేదని ఎలాంటి విచారణ జరపట్లేదని.. ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. కేసు పెట్టకపోతే తాను ఆత్మహత్య కి పాల్పడుతానని వంటికి నిప్పు అంటించుకుంటానని తెగ హంగామా చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్వామి చిన్మయనంద్ పై కేసు నమోదు చేసి సిట్ బృంధానికి కేసు అప్పగించారు. సిట్ బృంధానికి కేసు అప్పగించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోడం స్వామిని అరెస్ట్ చేయకపోడంతో రాజకీయంగా చర్చలు ప్రారంభమయ్యాయి.

రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఉద్వేగాన్ని తెలియజేస్తూ విమర్శలు చేసింది. ఉన్నావో కేసు పై కూడా ఇలాంటి జాడ్యమే చేశారని ఇప్పుడు స్వామి చిన్మయానంద్ కేసు లో కూడా అదే జాడ్యం చేస్తున్నారని సిట్ ఏమైనా ప్రభుత్వం చేతులో కీలు బొమ్మా..? అని ఆమె ప్రశ్నించింది. ఇక ఆమె వ్యాఖ్యలతో పోలీసుల్లో కొంత ఒత్తిడి పెరిగింది. ఓవైపు నుండి బాధితురాలు నిప్పు అంటించుకుంటానని మరో వైపున ప్రియాంక గాంధీ ఘాటు విమర్శలు చేయడంతో బీజేపీ అధికార ప్రతినిధి మనీశ్ శుక్లా స్పందించారు.. ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో చట్టం ముందు అందరూ సమానమేనని, సిట్ తన పనితాను చేసుకెళుతుందని అన్నారు. చిన్మయానంద్ అరెస్ట్ అనివార్యమైతే సిట్ తప్పకుండా

అదుపులోకి తీసుకుంటుందని, శాంతి భద్రతల విషయంలో తాము రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రిపై కేసు నమోదుచేసిన యూపీ పోలీసులు శుక్రవారం ఆయనను ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చిన్మయానంద్‌ను షహారన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్మయానంద్‌ను షహారన్‌పూర్‌లోని ఆయన ఆశ్రమంలో అరెస్ట్ చేసి, కట్టుదిట్టమైన భద్రత మధ్య హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: