వేములవాడలో కుప్పకూలిన వంతెన..! స్థానికుల ఆందోళన..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పూర్వంలో ఏమి నిబంధనలు పాటించారో.. ఏమి శ్రద్ధ వహించారో కానీ అప్పుడు కట్టిన భవనాలు చారిత్రిక నిర్మాణాలు ఇప్పటికీ చక్కుచదరకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది.. కొత్త మిషన్లు వచ్చాయి కొత్త పరికరాలు, ఇంజనీరింగ్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.. అతి ఆధునిక పద్దతులు వచ్చాయి కానీ ఇప్పుడు కట్టడాలు ఎందుకు నిలవడం లేదు. ఎంత ఖర్చు చేసినా కట్టడాలు ఎక్కువ కాలం నిలవడం లేదు..

ఇదే తరహాలో రూపాయలు 22 కోట్లవ్యయంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోని వేములవాడ పాత వంతెన పై నూతనంగా ఓ కొత్త వంతెన నిర్మిస్తున్నారు. ఆ వంతెన నిర్మాణానికి ఆధునిక టెక్నాలజీ వాడారు. గత నాలుగు ఏళ్లుగా ఈ వంతెన ని నిర్మిస్తూనే ఉన్నారు. అన్నీ కోట్లు పెట్టి అన్నీ ఏళ్ళు నిర్మిస్తుంటే గట్టి వర్షం తాకిడిని కూడా తట్టుకోలేకపోయింది. కొన్ని రోజులుగా నిర్గళంగా కురుస్తున్న వర్షంతో అక్కడి వాగు పొంగి పొరలుతుంది. వరద ప్రవాహం కూడా భారీగా పెరిగిపోయింది. వరద తాకిడికి వంతెన కి సంబంధించిన 2 పిల్లర్లు కుప్పకూలాయి. పిల్లర్లు కూలడంతో వంతెన విరిగి వారిగిపోయింది. దీంతో నిర్మాణ పనులను ఆపేశారు అధికారులు. వంతెన కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత వంతెన అలాగే ఉండటంతో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: