విలన్ పాత్రలో.. ప్రభాస్..! ‘600 కోట్ల’ బడ్జెట్ సినిమా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి, సాహో వంటి భారీ బడ్జెట్ సినిమాలతో భారీ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయాడు ప్రభాస్..! అదిరిపోయే నటన ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరోగా ప్రభాస్ కి మంచి గుర్తింపు ఉంది. ఏ పాత్రకైనా న్యాయం చేసే ప్రతిభ, క్యారెక్టర్ లో ఇమిడిపోయే అభినయం దానికి తోడు ఫిజిక్ ఈయనకి ప్లస్ పాయింట్స్. భారీ బడ్జెట్ సినిమా ఎవరు తీయాలన్నా ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ వైపు..! ప్రభాస్ సినిమాలో ఉంటే చాలు వాళ్ళకి మంచి ప్రమోషన్ దొరుకుతుంది దానికి తోడు ప్రభాస్ ఇచ్చిన పాత్రకి 100 శాతం న్యాయం చేస్తాడు. ఇక ఇదే తరహాలో ఇప్పుడు ప్రభాస్ కి ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చింది. అది కూడా ఓ విలన్ పాత్ర.. ఆ సినిమా బడ్జెట్ ఏకంగా 600 కోట్లు..!

సినిమా దర్శకుడు బాహుబలి సినిమా లోని శివుని ఆన పాట చూసి ఫ్లాట్ అయినట్టు ఉన్నాడు.. అప్పుడే ప్రభాస్ కి రావనుడి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అవును మీరు వింటున్నది నిజమే.. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాన్ ఇండియా సినిమా లోని రావనుడి పాత్రకి ప్రభాస్ అచ్చు గుద్దినట్టుగా సరిపోతాడు అని భావించాడు. ఇందుకు గాను ప్రభాస్ తో సన్నాహాలు కూడా చేసినట్టు సమాచారం. ప్రభాస్ కి పాత్ర గురించి చెప్పగా ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రావనుడి పాత్రకి ప్రభాస్ ని ఎంచుకోగా రాముడి పాత్రకి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను సీత పాత్ర కి దీపిక పాడుకోన్ ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారట..! ఈ పాత్రలకి యాక్టర్స్ ఓకే చెప్పారా..? లేదా..? అనేది ఇంకా తేలాల్సివుంది ఎందుకంటే ఈ చిత్రం పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: