గద్దలకొండ గణేష్ రివ్యూ ….!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలన్ పాత్రలో కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ క్రైమ్ మూవీ ‘ గద్దల కొండ గణేష్ ‘ . విడుదలకు కొన్ని గంటలవరకు కూడా వాల్మికీగా ఉన్న టైటిల్ ని ,కోర్టు ఆదేశాల మేరకు గద్దలకొండ గణేష్ గా మార్చిన ఎ సినమా ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వడం జరిగింది. టైటిల్ లోల్లితో కావల్సినంత ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసిన ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఆశించిన స్తాయి కంటే ఎక్కువగానే రాగ, అసలు ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో ఈ రివ్యూ లో చూసేద్దాం…,

కథ కథనం విశ్లేషణ ….!

కార్తిక్ సుబ్బరాజ్ అనే తమిళ దర్శకుడు తీసిన జిగర్ తాండ అనే సూపర్ హిట్ సినిమాను హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ గా రీమేక్ చేయడం జరిగింది. ‘ ఎలాగైనా మూవీ డైరెక్టర్ అయ్యి మంచి సినిమా తీయాలి అనుకునే షార్ట్ ఫిలిం డైరెక్టర్ హీరో అతర్వ మురళి.., తన మొదటి సినమా కథకోసం, ఒక రియల్ గ్యాంగ్ స్టార్ లైఫ్ స్టోరీని సినిమాగా తెరకెక్కించాలని అనుకుంటాడు. గ్యాంగ్ స్టార్ అన్వేషణలో ఉన్న హీరోకి గద్దలకొండ గ్రామంలో గద్దలకొండ గణేష్ ( వరుణ్ తేజ్ ) అనే కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ గురించి తెలుసుకుని, అతని కథే తన తొలి సినిమాకి సమంజసం అని బావిస్తాడు. స్టోరి రిసెర్చ్ లో బాగంగా .., గ్యాంగ్ స్టార్ అయిన వరుణ్ తేజ్ పాస్ట్ లైఫ్ ని ఎలా తెలుసుకుంటాడు, ఆ ప్రాసెస్ లో హీరోకి ఎదురైనా ఆటంకాలు ఏంటి, అసలు ఈ సినిమాను హీరో పూర్తి చేసాడా లేదా అన్నదే అసలు కథ.

ఏ హీరో విలన్ యాక్షన్ సినిమాల్లో అయిన, విలన్ పవర్ ఫుల్ గా ఉంటేనే , హీరో ఇజం అనేది ఎలివేట్ అయ్యి, సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఉదాహరణకు రాజమౌళి సినిమాలె.., రాజమౌళి కథల్లో విలన్స్ మనుషుల పీకలు కొరుక్కు తినేంత బయంకరంగా ఉంటారు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వారి మొహంలో నవ్వు బూతద్దం పెట్టి వెతికిన కనపడదు, వినాలన్నా వారి నోట నుండి ఒక్క మాట కూడా రాదు. అంత సిరియస్ గా ఉండే విలన్ ని చూడగానే సినిమా లోని పాత్రల వెన్నులో వెనుకు పుట్టాలి, అంత క్రురున్ని హీరో ఎదురిస్తే అప్పుడు వచ్చే మజా స్క్రీన్ పై చుసిన ఆడియన్స్ థ్రిల్ అవ్వాలి …, కరెక్ట్ గా తమిళ జిగర్ తాండ ఇక్కడే సక్సెస్ కొట్టింది. ఆ పాత్ర చేసిన బాబి సింహ క్రూరత్వానికి నేషినల్ అవార్డు వచ్చింది.., కానీ ఇక్కడ మన గద్దెలకొండ గణేష్ అండ్ బ్యాచ్ కనిపించే ప్రతి సీన్లో కామెడి చేసుకుంటూ, పంచ్ డైలాగ్స్ కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు…, ఎంటర్ టైన్మెంట్ పేరుతో, కథలోని ఒక సిరియస్ ఎమోషన్ ని పట్టుకోవడంలో తడపడ్డాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఒక సామాన్య అసిస్టెంట్ డైరెక్టర్, కిరాతకమైన గణేష్ అనే రౌడి దెగ్గరకు వెళ్లి, అతని ఊర్లో తిరుగుతూ, ఎవ్వరికీ తెలీకుండా అతని గురించి తెలుసుకుంటుంటే..ఈ విషయం ఆ రౌడీకి తెలిస్తే హీరోని వదిలిపెడతాడా, అడ్డంగా నరికి చంపెస్తాడెమో అన్న బయంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కి రావాలి. కాని మొదటి బాగంలో అదేమి ఉండదు.

వరుణ్ తేజ్ రౌడి బ్యాచ్ అంత కమెడియన్స్ తో నింపేయడం , వారు జోకులు వేసుకుంటూ సరదాగా తిరగడం, విలన్ ఏమో డైలాగ్ రైటర్ లా కనిపించిన ప్రతివాడిపై పంచ్ డైలాగ్స్ వేస్తుండటం, ఎక్కడ కూడా ఒక సిరియస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఆడియన్ కి రాదు… కాని సరిగ్గా ఫస్ట్ హాఫ్ అయిపోయే పది నిమిషాల ముందుర వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మనల్ని థ్రిల్ చేస్తుంది… నింపాదిగా సాగిపోతున్న సినిమా టోన్ కాస్త ఒక్కసారిగా మారిపోతుంది. ఇక అదే రీతిలో సెకండ్ హాఫ్ ఉంటుందేమో అని ఎక్స్ పెక్ట్ చేసే అబిమానికి మల్లి నిరాశనే మిగులుతుంది. హీరో మురళి గణేష్ కి దేగ్గరవ్వడానికి, హీరోయిన్ మిర్నాలిని ఉపయోగించు కుంటాడు. అనుకోకుండా మురళి ప్రేమలో పడే హీరోయిన్, వారిద్దరి లవ్ ట్రాక్ మనల్ని ఏమంతగా మెప్పించదు. ఈ సినిమాకి ప్రధాన లోపం …, రక్తం రుచి మరిగిన విలన్ వరుణ్ కి సినిమాలో తనకంటూ ప్రత్యెక కథే ఉండదు . అందుకే దీన్ని ఫిల్ చేయడానికి, హీరోయిన్ పూజ హెగ్డే తో ఒక ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరి పెట్టి ప్రేక్షకులని కొంచం ఎంటర్ టైన్ చేసాడు హరీష్. అది కూడా సిరియస్ గా ఉండకపోవడం, కథకి ఏమాత్రం ఉపయోగపడదు . పూజతో ప్రేమ కారణంగా గణేష్ రౌడి అవ్వడు , పూజ తో బ్రేక్ వల్ల రౌడి ఇజం ని వదిలేయ్యడు. సెకండ్ హాఫ్ లో వచ్చే పూజ హెగ్డే లవ్ ట్రాక్ ని, కేవలం ఒక పాట కోసమే పెట్టినట్టు ఉంటుంది. కాని ఆ ఒక్క పాట మాత్రం సినిమ మోత్తంలో ఒక హై మూమెంట్ ని తీసుకొస్తుంది.

ఇక కమెడియన్ సత్య ఈ సినిమా త్రూ అవుట్ మనల్ని నవ్విస్తూ ఉంటాడు. సినిమాలో ఎన్ని బొక్కలున్న కాని కామెడిని డీల్ చేయడంలో మాత్రం హరీష్ కి నూటికి నూరు మార్కులు వెయ్యొచ్చు. కమెడియన్స్ సత్య, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్ ఇలా ప్రతి క్యారెక్టర్ మనల్ని నవ్విస్తూనే ఉంటారు. ఇక సీను సీనుకి పేలిపోయే పంచ్ డైలాగ్స్ తో హరీష్ తన పెన్ను పదునేంతో మరో సారి ప్రూవ్ చేసకున్నాడు. హీరో మురళి తన వంతుగా మంచి పర్ఫర్మేన్సునే అందించాడు., వేలువచ్చే గోదారమ్మ సాంగులో పూజ అందాలూ సినిమాకే హైలైట్ అవుతాయి. కొత్త హీరోయిన్ మిరినాలిని పర్వాలేదు అనిపిస్తుంది. ఇక బాలివుడ్ కెమరా మాన్ ఆయంక బోస్, మ్యుజిక్ డైరెక్టర్ మిక్కి మంచి పనితనాన్ని కనబరిచారు. గద్దెల కొండ గణేష్ పాత్రకి వరుణ్ తేజ్ ఇంకా హోం వర్క్ చేస్తే బావుండేది. గెట్ అప్ ,లుక్స్ బావున్న , స్క్రీన్ పై ఇంటన్ సిటిని చుపెట్టడంలో విఫలమయ్యారు. గబ్బర్ సింగ్ లో పవన్ ఆటిట్యూడ్ ని అచ్చం దిన్చేసాడు. ఇది అభిమానుల వరకు ఓకే కాని, కామన్ ఆడియన్స్ ని నిరాశ పరుస్తుంది . ఇక చివరిగా ఒక సీరియస్ ఐకానిక్ ఫిలిం జిగర్ తాండ ని కథ స్క్రీన్ ప్లే అప్పలరాజు సినిమాలా మార్చి ఎంటర్ టైన్ చేసాడు దర్శకుడు హరీష్.

ఈ సినిమాకి మహా రేటింగ్ 2.5 out of 5

Share.

Comments are closed.

%d bloggers like this: