హైదరబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో..! ప్రత్యేకతలివే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైటెక్ సిటీ మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ లోని రాగివ్ గాంధీ ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం 31 కిలోమీటర్ల  మెట్రో మార్గం వస్తుందని ఇందుకు గాను కసరత్తులు చేస్తున్నారని ప్లాన్ వేస్తున్నారనే సంగతి మనకి తెలిసిందే. ఇక ఈ నేపద్యంలో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్లాన్ పూర్తిగా సిద్ధం అయ్యింది. మైండ్ స్పేస్ తో మొదలుకొని రాజీవ్ గాంధీ ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు మార్గం సిద్ధం కానుంది. రూట్ అంతా పిల్లర్ల పైనే కొనసాగనుంది.. కానీ మూడు కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ను ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ అని పిలుస్తున్నారు. ఇది డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ టర్మినల్ కి కనెక్ట్ కానుంది అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు గల బడ్జెట్ ని డిజైన్ చేస్తుయినట్టుగా తెలిపారు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) మేనేజింగ్ డైరెక్టర్ N V S రెడ్డి. ఇటీవల అమీర్‌పేట-హైటెక్ సిటీ రూట్‌లో కారిడార్ 3లో (నాగోల్-శిల్పారామం) రైళ్ల సంఖ్యను పెంచారు. కీలక సమయాల్లో 4 నిమిషాలకు ఓ ట్రైన్ వెళ్లేలా చేశారు. మియాపూర్-ఎల్బీ నగర్ రూట్‌లోని కారిడార్-1లో… ప్రతి ఐదు నిమిషాలకు ఓ ట్రైన్ వస్తోంది. ఇంతకుముందు… ప్రతి ఆరేడు, నిమిషాలకు ఓ ట్రైన్ వెళ్లేది. మొత్తం మీద మెట్రో మంచి ఊపు మీదే ఉందని అర్ధం అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: