ఆస్కార్ కి నామినేట్ అయిన డియర్ కామ్రేడ్..! సంతోషంలో రౌడీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు మీరు వినే వార్తల్లో మంచి న్యూస్ ఇదే..! ఎన్నో పురస్కారాలు ఉన్నా అందులో ఆస్కార్ ఏ మిన్న.. అని సినీ వర్గాలు అంటాయి. ప్రతీ నటుడు దర్శకుడు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఆస్కార్ పురస్కారం దక్కితే చాలు అనుకుంటారు. ఎందుకంటే ఈ పురస్కారాలు అంతా స్పెషల్..! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్నీ భాషల సినిమాలు ఆస్కార్ ని నామినేట్ అవుతాయి. ప్రతీ దేశం నుండి ఆ సంవత్సరం కు గాను బెస్ట్ 29 సినిమాలని ఆస్కార్ యాజమాన్యం కి పంపబడుతాయి. ఇక వాటిల్లో కల్ల బెస్ట్ ని ఆస్కార్ సెలెక్ట్ చేస్తుంది. ఇక ఇలాంటి గొప్ప ప్రతిష్ట ఉన్న ఆస్కార్ కి మన తెలుగు సినిమా నామినేట్ అవుతే..? అదృష్టం కొద్ది అవార్డు దక్కితే..?

ఆస్కార్ పురస్కారాలకు మన దేశం నుండి 29 సినిమాలు సెలెక్ట్ చేశారు..  అందులో మన తెలుగు సినిమా కూడా ఉండటం మన అదృష్టం అనే చెప్పాలి. అవును టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నటించిన సినిమా యువ డైరెక్టర్ భారత్ కమ్మా డైరెక్ట్ చేసిన సినిమా డియర్ కామ్రేడ్.. మన దేశపు బెస్ట్ 29 సినిమాల్లో ఒకటిగా ఎంపికయ్యింది. ఆ లిస్ట్ లో అంధాధున్, బదాయి హొ, యూ ఆర్ ఐ.. వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు డియర్ కామ్రేడ్ కూడా ఎంపిక అవ్వడం గమనార్హం.

నిజానికి భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కుప్పకూలింది. సినిమా చాలా లెంథీ గా ఉందని డైరెక్టర్ బాగా ల్యాగ్ చేశారని అభిమానులు కామెంట్స్ చేశారు.. కానీ కొంత మంది మాత్రం ఈ సినిమాకి చాలా కనెక్ట్ అయిపోయారు.. సినిమా లోని పాత్రలు లిల్లీ బాబీ లు అదరగొట్టారని.. స్టోరీ చాలా కనెక్ట్ అయ్యిందని ఈ సినిమాని ఓ క్లాసిక్ గా కంపర్ చేశారు. ఏది ఎలాగ ఉంటే ఏంటి.. మొత్తానికి సినిమా మాత్రం నామినేట్ అయ్యింది. సినిమా ఒకవేళ ఆస్కార్ సంస్థ సెలెక్ట్ చేస్తే ఇక హీరో విజయ్ దేవరకొండ కి తిరుగే ఉండదు.. పైగా తెలుగు చలనచిత్ర సీమ అంతా చాలా ఆనందపడుతుంది అనే చెప్పొచ్చు.

Share.

Comments are closed.

%d bloggers like this: