ప్రపంచ పటంలో పాక్ ని మాయం చేస్తాం..! కిషన్ రెడ్డి హెచ్చరిక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ ఆదివారం నాడు కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన జన జాగరణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. ఆర్టికల్ 370 గురించి మాట్లాడినా ఆయన ఆపై పాక్ పై యుద్ధం గురించి మాట్లాడారు. పాక్ పై ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే పాక్ అనే దేషాన్నే ప్రపంచ పుటంలో లేకుండా చేస్తామని ఆయన పాకిస్తాన్ ను హెచ్చరించారు. ఆర్టికల్ 370 రద్దు సరైన నిర్ణయం అని ప్రధాని మోడీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశంసించారు.

ఆర్టికల్ 370 ని ముందుగా నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం లో ఏర్పాటు చేశారని ఆ నిర్ణయం వల్ల అప్పట్లోనే 42 వేల మండి చనిపోయారని ఆయన చరిత్ర ను గుర్తు చేశారు. ఆర్టికల్ 370 కారణంగా ఇప్పటికే పాకిస్తాన్ తో 4 సార్లు యుద్ధం జరిగిందని అలాంటి కీడు తెచ్చిన విషయాన్ని రద్దు చేస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370 కారణంగా కాశ్మీర్ లో భారత రాజ్యాంగం వర్తించడమే కాకుండా అక్కడున్న మైనారిటీలకి మహిళలకీ రిజర్వేషన్లు ఉద్యోగ రిజర్వేషన్లు ఉండవు అన్నారు. ఇంత కాలం అక్కడి ప్రజలు ఎంతగానో కష్టాలు అనుభవించారని ఇక ఇప్పటి నుండి అలాంటి కష్టాలు ఉండవని ఆయన వెల్లడించారు.

ఆర్టికల్ 370 రద్దుకు ముందు కాశ్మీర్ లో 65 వేల తీవ్రవాద దాడులు జరిగాయని వేల కొద్ది కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. అదే ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత అక్క ఒక్క తుపాకి కూడా పేలలేదని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ ఒక అద్భుతమైన చర్య చేపట్టారని అది ప్రజలకి అనుకూలించే నిర్ణయం అని ఆయన హితువు పలికారు. ఇటలీ పాకిస్థాన్ వంటి దేశాల్లో లేని ఆర్టికల్ 370 మన దేశం లో ఎందుకు ఉండాలి అని ఆయన ప్రశ్నించారు. భారత్ పాక్ ను ఇప్పటికే చాలా ఉపేక్షించిందని ఇక పై అలా ఉండబోమని ఆయన హెచ్చరించారు. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధమే సంభావిస్తే పాక్ అనే దేశాన్ని ప్రపంచ పుటం లోనే లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: