మోడీ నోట తెలుగు మాట..! హోరెత్తిన ‘హౌడీ మోడీ’ సభ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘హౌడీ మోడీ’ అంటూ మోడీ ని ప్రేమగా ఆహ్వానించారు భారత అమెరికన్లు.. మరి భారతీయులు పిలుస్తే మోడీ వెళ్లకుండా ఉండగలడా..? ప్రధాని మోడీ హ్యూస్టన్ లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులని ప్రేమగా పలకరించాడు.. అంటే కాదు అనేక భాషల్లో మాట్లాడి సభ కి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. హ్యూస్టన్ కి చేరిన ప్రధాని మోడీని సాధారంగా ఆహ్వానించి అపూర్వ స్వాగతం పలికింది ఆమ్రేకన్ గవర్నమెంట్. మోడీ పేరిట నిర్వహించిన సభకి విశేష స్పందన లభించింది. దాదాపుగా 50 వేళ మందికి పైగా భారతీయులు హాజరయ్యారు.

మొదట మోడీని ఆహ్వానిస్తూ భారతీయులని ఉద్దేశిస్తూ ప్రసంగం చేయాల్సిన ప్రసిడెంట్ ట్రంప్ కొన్ని కారణాల వల్లా అక్కడికి టైమ్ కి రాలేకపోయారు.. దీంతో మొదట మోడీ మాట్లాడాల్సి వచ్చింది. మైక్ అందుకున్న మోడీ అందరి మనసులు కొల్లగొట్టాడు. ప్రెసిడెంట్ ట్రంప్ ని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు. ప్రవాస భారతీయులని ప్రేమగా పలకరించారు. హ్యూస్టన్ వాసులకి ధన్యవాదాలు తెలుపుతూ మోడీ మంచి ప్రసంగం చేశారు. ఎప్పుడు హిందీ లో మాట్లాడే మోడీ అనేక భాషల్లో మాట్లాడారు.. అన్నిటికన్నా స్పెషల్ గా మన తెలుగు భాష లో మాట్లాడాడు. అంతా బాగుందని తెలుగు లో మోడీ మాట్లాడేసరికి అక్కడున్న మన తెలుగువాళ్ళంతా కెరీటాలు కొట్టారు.. హర్షధ్వనులతో సభ ఒక్కసారిగా హోరెత్తింది. మన సంగతులే మాట్లాడకుండా అమెరికా లో రాబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ ప్రెసిడెంట్ ట్రంప్ ని గెలిపించండి అంటూ మోడి అక్కడి భారతీయులని కోరాడు.. ట్రంప్ తో ఉన్న స్నేహానికి నిదర్శనంగా తన మద్దత్తుని మోడీ తెలిపాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: