ప్రభాస్..! 1970 లవ్ స్టోరీ..! డ్యూయల్ రోల్…! మరిన్ని విషయాలు…

Google+ Pinterest LinkedIn Tumblr +

డార్లింగ్ ప్రభాస్ ఇటీవలే సాహో సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. సినిమా కి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్ యాక్టింగ్ కు మాత్రం పూర్తి మార్కులు వేశారు అభిమానులు. టాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా ఆధరించకపోయినా బాలీవుడ్ లో మాత్రం సినిమా కు కొంత వరకు పాజిటివ్ టాక్ ఏ వచ్చింది. వసూళ్లు కూడా బాగానే చేయగలిగింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ ని కూడా అట్రాక్ట్ చేయాలని అక్కడ కూడా మార్కెట్ పెంచుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఇందుకుగాను తన నెక్స్ట్ సినిమాకి తగిన కసరత్తులు చేస్తున్నాడట..! తన నెక్ట్ సినిమా తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా హిందీ లో కూడా వస్తునట్టు తెలుస్తుంది.

ఇక సాహో తో మంచి యాక్షన్ థ్రిల్లర్ తీసిన ప్రభాస్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడు.. ఎలాంటి జానర్ ఎంచుకుంటాడు. సినిమా టైటిల్ ఏంటి..? సినిమా డైరెక్టర్ ఎవరు నటులు ఎవరు అనే ప్రశ్నలు రావడం కామన్. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు. సినిమా 1970 కాలంలో నడిచే ఓ ఇంటెన్స్ లవ్ స్టోరీ..! ప్రభాస్ ఈ సినిమా లో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని కూడా టాక్ ఉంది. ఇక సినిమా కి కథానాయికగా పూజ హెగ్డే ని ఎంపిక చేసుకున్నారు. సినిమాలో ప్రభాస్ ఆస్ట్రాలజీ తెలిసిన వ్యక్తిగా హస్తసాముద్రికం విద్య తెలిసిన వ్యక్తిగా కనిపించనున్నాడు. సినిమా షూటింగ్ దాదాపుగా ప్యారిస్ లోనే జరగబోతుందని కొంత భాగం మన దేశంలో జరగబోతుంది.

సాహో సినిమా షూటింగ్ చేస్తున్న టైమ్ లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.. కానీ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ బిజీ అయ్యేసరికి కొంత బ్రేక్ పడింది తాజాగా ఈ చిత్రా షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు.. ఇందుకు గాను ప్రభాస్ తన టీంతో కలిసి ప్యారిస్ కి వెళ్ళినట్టుగా సమాచారం. సినిమా టైటిల్ గా జాన్ ని ఎంపిక చేసుకోబోతున్నారట.. మరి టైటిల్ జాన్ అనే పెడతారో మారుస్తారో తెలీదు.. అధికారిక ప్రకటన వచ్చే వరకు క్లారిటీ లేదు. సినిమా కథతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ ప్రజలని అట్రాక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట..మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎన్ని మనసులు కొల్లగొడతాడో తెలియాలంటే వెయిట్ చేయాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: