సైరా వివాదంలో మరో ట్విస్ట్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి ఫ్యామిలీ తో సైరా చిత్ర యూనిట్ గొడవ రోజుకో మలుపు తిరుగుతుంది. సైరా సినిమా కథ విషయయంలో తమతో ఒప్పందం చేసుకని, మోసం చేశారని, ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి ఫ్యామిలీ మొన్నటికి మొన్న జూబ్లి హిల్స్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఇప్పుడు అదే ఫ్యామిలీ మెంబర్స్ కొందరు చిరంజీవికి సన్మానం చేస్తామంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇదే సందర్బంగా ఉయ్యాలవాడ కుటుంబంలోని మరికొందరు తమకు ఇప్పుడు తమ ఊళ్లో నెలకొల్పబోతున్న ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆ వేడుకలో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కొందరు ప్రత్యేకంగా చిరంజీవిని సత్కరించబోతున్నట్లు ఉయ్యాలవాడ కుటుంబంలోని కొందరు సభ్యులు మీడియాకు ప్రకటన విడుదల చేసారు.

దాంతో ఈ కుటుంబం అధికారికంగా రెండు ముక్కులైపోయిందని అర్థమవుతుంది. కొందరికి చిరంజీవి ఈ చిత్రం చేయడం ఇష్టమే.. కానీ మరికొందరు మాత్రం అడ్డుపడుతున్నారు. వాళ్లలో వాళ్లే ఇలా గొడవపడి బయటికి వచ్చేసారు. అంతేకాదు తామసలు చిరంజీవిని ఏ ఒక్క రోజు కూడా డబ్బు ఇవ్వాలని అడిగినట్లు లేదని.. ఆయన చేస్తున్న ‘సైరా’ వల్ల తమ కుటుంబానికి ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు వాళ్లు. ఇదంతా కావాలని ఎవరో వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కొట్టి పారేయడం ఇక్కడ అసలు ట్విస్ట్. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇవన్నీ చేస్తున్నారంటూ వాళ్లు చెప్పడం ఇప్పుడు సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: