హాల్ లో చప్పట్ల వర్షం…‘సైరా‘ సెన్సార్ రిపోర్ట్ ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా కెమరా కోసమే పుట్టిన మొహం మెగా స్టార్ చిరంజీవి సొంతం అంటూ ఇండస్ట్రి లో ఒక టాక్ ఉంటుంది. అది విన్న ఎవరికీ అయినా ఈ విషయంలో బెధబిప్రయం ఉండదు. సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా టాలివుడ్ లో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నాడు. అటు ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ లా జెనరేషన్ మొదలు పెట్టి , బాల కృష్ణ నాగార్జున జెనరేషన్ ను దాటుకుని, ఇప్పుడు జునియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు అఖిల్ వంటి థర్డ్ జెనరేషన్ హీరోల మధ్యలో కూడా నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఎవరేస్టు శిఖరమంత ఎత్తు ఎదిగిన చిరంజీవికి ఎక్కడో చన్న వెలితి, కెరీర్లో అన్ని జానర్ సినిమాలు తీసిన, అరేయ్ ఇదొక్కటి చేస్తే చాలు, కాని చేయలేకపోయానే అని ఎక్కడో చిన్న నిరాశ. ఇపుడు అవన్నీ దాటుకుంటూ, సైరా నరసింహారెడ్డి ద్వారా ఆ కోరికలన్నీ తీర్చుకుని, తన చిరకాల స్వప్నాన్ని అందుకున్నాడు మెగా స్టార్ చిరంజీవి. ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిందీ ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది.

ఈ మధ్యకాలంలో చిరంజీవి హిందీలో సినిమా చెయ్యలేదు. కానీ సైరాకి బాలీవుడ్‌లో సైతం ఒక రేంజ్‌లో క్రేజ్ ఏర్పడింది. ఈ భారీ సినిమాని అతి భారీగా రిలీజ్ చెయ్యడానికి సర్వం సిద్ధం. అందుకే ఈ సినిమాకి లాస్ట్ మినిట్ టెన్షన్ తీసుకోకూడదు అని అప్పుడే సెన్సార్ చేయించేసారు. ఈ పేట్రియాటిక్ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.
2 గంటల 44 నిముషాల నిడివితో సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది సైరా. ఈ సినిమాకి సెన్సార్ నుండి అదిరిపోయే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ కన్నీళ్ళు పెట్టిస్తాయట, వాటితరువాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి అంటున్నారు. అసలు ట్రైలర్‌లో సైతం టచ్ చెయ్యని పాటలు కూడా ఒక రేంజ్‌లో వచ్చాయట. సైరా గురించి ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు ఆ వెయిటింగ్‌కి తగ్గ గిఫ్ట్‌గా ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. మీడియా సర్కిల్స్ రిపోర్టు ప్రకారం అయితే, సైరా సెన్సార్ అయిపోగానే, మన తెలుగు తొలి స్వతంత్ర పోరాట యోదుది చరిత్రను చూసి గౌరవంగా ప్రివ్యూ హాల్ లో సెన్సార్ సభ్యులు లేచి చప్పట్లు కొట్టారని తెలుస్తుంది ఇక అక్టోబర్ 2న రిలీజ్ అయ్యేందుకు సైరా సర్వం సన్నద్ధం అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేందుకు వస్తున్న సైరా సినిమా టీమ్‌కి ఆల్ ది బెస్ట్.

Share.

Comments are closed.

%d bloggers like this: