జగన్ కేసీఆర్ లు కలిశారు..! కృష్ణ గోదావరులను కలిపారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ లోని ప్రగతి భవన్ లో నిన్న ఇద్దరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవ్వడంతో తెలుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు నుండి తన మద్దత్తును తెలుపుతూ వస్తున్నారు. ఇక జగన్ కూడా సీఎం కేసీఆర్ ని సగౌరవంగా ఆధారిస్తూ వచ్చారు. అప్పటి నుండే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఒకరి సలహాలు ఒకరు పాటిస్తూ.. మంచి సన్నిహిత్యాన్ని కనబరుస్తూ పరస్పరంగా నడుచుకుంటున్నారు. ఇద్దరు సీఎం లే కాదు రెండు రాష్ట్రాలు ఐకమత్యంగా ఉండాలని కోరుతున్నారు..

ఇందుకు గాను ఒకరి ప్రకృతిక నిదులను ఒకరు పంచుకుంటున్నారు.. గోదావరి కృష్ణ నదులను అనుసందానం చేసేందుకు.. విభజన సమస్యలను పరిష్కరించడానికి.. ఇక మారు ఇతర విషయాలు సద్దుబాటు చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు అందుకు గాను నిన్న సమావేశమయ్యారు.

భేటీ లో ప్రధానంగా.. నదుల అనుసందానం పై చర్చ జరిగింది. గోదావరి జలాలను వృధాగా పోనివ్వకుండా కృష్ణ నడితో అనుసంధానం చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు.. తక్కువ ఖర్చు తో.. వీలైనంత తక్కువ భూసేకరణతో నదులను అనుసంధానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఇంజనీర్లు ప్రాజెక్ట్ అధికారులు కలిసి చర్చలు జరిపారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి ఎలా తరలించాలి, అలైన్‌మెంట్ ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించారు.

ఇది ఇలా ఉండగా విద్యుత్ పోలీస్ శాఖ లపై కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 18 వేల మంది పోలీసులని నియమిస్తున్న విషయం తెలిసిందే.. అందరికీ ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వడం కష్టంగా ఉందని భావించిన కేసీఆర్.. 4 వేల మందికి ఏపీ లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని జగన్ ను కోరారు.. జగన్ ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఇక ఈ అంశాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రాజెక్ట్లపై వాటి పూర్తి వినియోగం పై, తెలుగు రాష్ట్రాల పట్ల సెంట్రల్ వైఖరి పై కూడా ఈ చర్చ లో సంభాషణ చోటు చేసుకుంది. తిరుపతి లో జరిగే బ్రహ్మత్సవాలకు కేసీఆర్ ని సాధారంగా ఆహ్వానించారు జగన్.

Share.

Comments are closed.

%d bloggers like this: