ఈ వారం ఎలిమినేషన్ ఎవరో తెలిసిపాయింది….!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ సందడి మల్లి మొదలైంది. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లో హిమజ వెళ్ళిపోవడం ఆ తరువాత రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ జెమ్ ఆడటంతో సహజంగానే ఈ వారంతం ఎలిమినేషన్ పై కావల్సినంత ఉత్కంటత నెలకొన్నది. అయితే ఇప్పుడు హౌస్ లో మిగిలిన 9 మంది మధ్య మంచి బాండింగ్ ఏర్పడటంతో ఎలిమినేషన్ ప్రక్రియ టఫ్ గా సాగింది. 10వ వారం నామినేషన్స్ లో భాగంగా 9 మంది సభ్యుల్లో కెప్టెన్ మహేశ్ ని పక్కనబెట్టి మిగిలిన 8 మందిని జంటలుగా విభజించారు. శివజ్యోతి-శ్రీముఖి – రవి-వితికా – వరుణ్-రాహుల్ – బాబా భాస్కర్-పునర్నవిలని జంటలుగా పెట్టి…వారిలో ఎవరికి ఇంట్లో ఉండటానికి అర్హతలు ఉన్నాయో – గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో వాదించుకోవాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీనితో శివ జ్యోతి శ్రీ ముఖిలు వాదించుకున్నా ఫలితం తేలకపోవడంతో ఇగితింటి సభ్యులు వోటింగ్ కి దిగారు. మహేశ్ – బాబా భాస్కర్ – రవి – రాహుల్ లు…జ్యోతికి ఓటు వేశారు. వరుణ్ – పునర్నవి – వితికాలు…శ్రీముఖికు ఓటు వేశారు. అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన జ్యోతి సేవ్ అయ్యి…శ్రీముఖి ఎలిమినేషన్ లోకి వెళ్లింది. అనంతరం.. వితికా – రవిల మధ్య నామినేషన్స్ వార్ జరగ్గా ఈ ఇద్దరిలో హౌస్ మేట్స్ నుండి వితికాకే ఎక్కువ ఓట్లు రావడంతో వితికా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి రవి ఎలిమినేషన్ జోన్లోకి వెళ్లాడు.

ఇక మూడో జోడీగా వరుణ్-రాహుల్ మధ్య నామినేషన్ జరగగా..రాహుల్ సేఫ్ అయి వరుణ్ నామినేట్ అయ్యాడు. ఇక నాల్గవ జోడిగా వచ్చిన పునర్నవి మరియు బాబా బాస్కర్లలో , పునర్నవి సేఫ్ అయి బాబా నామినేషన్ కి ఎంపిక కావడం జరిగింది. చివరికి ఈ వారం నలుగురు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చారు. శ్రీముఖి – రవి – వరుణ్ – బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. అయితే వీరు నలుగురు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ కావడంతో…ఈ వారం ఎలిమినేషన్ ఓటింగ్ టఫ్ గా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ నలుగురిలో ఈ సారి రవికి బంగాపాటు తప్పదేమో , రవి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలున్నాయి అంటూ అప్పుడే వదంతులు మొదలైపోయాయి . చూడడం మరి వీరిలో ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకెళ్లతారో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: