కళ్ళు పీకి చెవులు కోసి..! వల్లంతో కాట్లు..! కళ్ళు చెదిరే దృశ్యం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అన్నదమ్ములు అక్కచెల్లెల్ల మధ్య మనం గొడవలు చూస్తూనే ఉంటాము అవి సర్వ సాధారణం. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు.. ఒక్కోసారి ఆ గొడవలు కాస్త పెద్దగా అవుతాయి..కానీ ఆ గొడవలు ప్రమాదాలకి దాడులకి దారి తీస్తేనే అది వింత..! కానీ ఈ కాలంలో దాడులే కాదు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తమ తోబుట్టువు అని కూడా జాలి చూపించకుండా హత్యలకి పాల్పడుతున్నారు.. ఆస్తి తగాదాలు, ఈర్ష్య, ద్వేశాలే ఇందుకు కారణం అవుతున్నాయి. ఇదే కోణంలో రష్యాలో ఎవ్వరూ ఊహించలేని ఓ ఘటన జరిగింది. ఓ యువతి తన సోదరిని దారుణంగా హత్య చేసింది. కళ్ళు పీకెసింది, చెవులు కోసేసింది.. దారుణంగా హత్య చేసింది.

వివరాల్లోకి వెళితే.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో స్టెఫానియా డబ్రోవినా అనే ఓ 17 ఏళ్ల అమ్మాయి చిన్న వయసు నుండే మోడల్ అవ్వాలని కోరుకుంది. 17 ఏళ్లకే తాను మోడల్ గా ఎదిగింది. తన ఫోటోలు సోషల్ మీడియా లో పెట్టేది దానికి గాను ఆమెకి మంచి స్పందించి లభించేది. ఇదంతా తన అక్క ఎలిజావేటా(22) కు నచ్చేది కాదు. తన సోదరి తనకన్నా బాగుందని.. అందరూ తన చుట్టే తిరుగుతున్నారని ఎప్పుడూ ఈర్ష్య పడేది. దీంతో ఇద్దరికీ ఎప్పుడు గొడవలు అయ్యేవి.

ఎలిజావేటా తన చెల్లి పై రోజు రోజుకు కసి ని నింపుకుంది.. ఆ కసి కాస్త కక్ష గా మారింది. ఎలాగైనా తన చెల్లిని చంపేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో ఓ రోజు తన చెల్లి నిద్రపోతున్న సమయంలో తనపై కత్తితో దాడి చేసింది. తన చెల్లి బ్రతికి ఉండగానే కళ్ళు పీకెసింది… చొవులు కోసేసింది దారుణంగా హింసించింది. తన చివరి శ్వాస విడిచేవరకు హింసిస్తూనే ఉంది. అలా తన వంటి పై 189 కత్తి పాట్లు పొడిచింది. దారుణంగా మానవత్వాన్ని మరిచి హత్య చేసింది. తన చెల్లిని హత్య చేసి ఆ శవాన్ని తన చెల్లి బాయ్ ఫ్రెండ్ అలెక్సీ ఫటీవ్ (44) ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయింది.

ఆ సమయంలో అలెక్సీ ఇంట్లో లేదు.. వైన్ బాటిల్ కొనడానికి బయటకి వెళ్ళాడు. సరిగ్గా ఎలిజావేటా ధవాన్ని పారేసి వెళ్ళగానే అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకోగానే కళ్ళు చెదిరే దృశ్యం..! తన ప్రేయసి ని ఆ రీతిలో చూసి షాక్ అయ్యాడు. వెంటనే అలిజావేటా కార్ కనిపించడంతో ఆమెని వెంటాడి పట్టుకొని పోలీసులకి అప్పగించాడు. పోలీసులు ఇద్దరినీ అదుపులో తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఎలిజావేటా మరియు తన తల్లి ఈ దాడిని అలెక్సి చేశాడని అంటున్నారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ గత రాత్రి.. డబ్రోవినా న్యూడ్ గా ఫోటోలు తీయించుకుందని ఈ విషయం నచ్చని అలెక్సీ ఇలా చేశాడని చెబుతుంది.. కానీ పోలీసులకి తగిన ఆధారాలు దొరకడంతో ఈ ఘటనకి బాధితురాలి అక్కే కారణం అని తేలింది.. దీంతో ఎలిజావేటా కి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చని పోలీసులు చెబుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: