విజయ్ సేతుపతికి మైండ్ బ్లాకింగ్ రెమ్యునరేషన్….!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ఫ్యామిలీ లోని రెండు ప్రతిష్టాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వనున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. అందులో ఒకటి మెగా స్టార్ చిరంజీవి చారిత్రిక చిత్రం సైరా. బ్రిటిష్ వారిపై పోరులో నరసింహ రెడ్డికి వెన్ను దన్నుగా నిలిచే తమిళ వీరుడి పాత్రలో విజయ్ సేతుపతి నట విశ్వరూపమే చూపించాడు అని టాక్. చిరంజీవి తరువాత ఆకట్టుకునే నటన సైరాలో విజయ్ సేతుపతిదే అట. అయితే ఈ చిత్రంకంటే ముందే విజయ్ సేతుపతి మరో మెగా సినిమాకి కమిట్ అయ్యాడు.

మెగా స్టార్ చిన్న మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణో తేజ్ చిత్రమే అది. వైష్ణో తేజ్ లాంచింగ్ చిత్రంలో ఒక కిలఖ పాత్రకి విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసుకున్నారు చిత్ర యూనిట్ వారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ లో విజయ్ కి మతిపోయే రెమ్యునరేషన్ ఇస్తున్నారట మెగా ఫ్యామిలీ. సైరా సినిమాకి గాను నాలుగు కోట్లు రెమ్యునరేషన్ ని ఫిక్స్ చేసాడట రాంచరణ్. తమిళ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ఉండటంతో, సైరా తమిళ్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగిందట. రజిని, కమల్, విజయ్, అజిత్, సూర్య,వంటి హీరోలకు ధీటుగా విజయ్ సేతుపతికి ఉన్న మార్కెట్ దృష్ట్యా, వైష్ణో తేజ్ సినిమాకి గాను విజయ్ కి సుమారు 5 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి మరి చేపించుకుంటునట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ఉప్పెన అనే పేరుని కూడా కన్ఫర్మ్ చేసారట. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమా ఆలస్యం అవుతుండటంతో, సైరా లో కమిట్ అయ్యాడట విజయ్. లేకపోతే వైష్ణో తేజ్ ఉప్పెన సినిమానే విజయ్ సేతుపతికి తెలుగులో డెబ్యు ఫిలిం అయ్యి ఉండేది. అది కాకపోయినా అంతకంటే ప్రతిష్టాత్మక చిత్రం సైరా లో తమిళ పోరాట యోధుడు రాజ పాండి పాత్రలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్నాడు విజయ్ సేతుపతి .

Share.

Comments are closed.

%d bloggers like this: