బన్ని ఫస్ట్ సాంగ్ ‘సామజవరగమన‘….!

Google+ Pinterest LinkedIn Tumblr +

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇచ్చిన బారి షాక్ తో బన్నికి కెరీర్లో అనుకోని గ్యాప్ వచ్చి పడింది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే అన్నట్టు మాటల మాంత్రి కుడితో జత కట్టారు అల్లు అర్జున్. వీరిద్దరిది కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ త్వరలో విడుదల కానుందని తెలుపుతూ చిన్న బిట్‌ను అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్ బిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ సాంగ్‌ను సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకువెళ్లకు దయలేదా అసలు..’ అంటూ సాగే ఈ పాటకు ఎస్. ఎస్. థమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: