మోడీ ని కడిగేసిన ఇమ్రాన్ ఖాన్..! పాక్ ప్రధాని భయంకర వ్యాఖ్యలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

శాంతీ అహింస అంటూ ప్రధాని మోడీ శుక్రవారం ఐక్యరాజ సమితిలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.. అనంతరం పాకిస్థాన్ ప్రధాని స్టేజీ ఎక్కారు.. అందరూ అనుకున్న విదంగానే ఆయన కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.. ముఖ్యమైన వేధిక దొరికితే చాలు ఆయన నోట కాశ్మీర్ మాటే వినిపిస్తుంది. పట్టు వదలని విక్రమార్కుడిలా మోడీ ఎక్కడికి వెళితే అక్కడకి వెళుతున్నారు.. మోడీ శాంతి బద్రతలు, ప్రపంచ విషయాలు, వాతావరణ మార్పులు.. అంటూ ప్రసంగాలు చేస్తుంటే మరోపక్క పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం సందు దొరికితే చాలు కాశ్మీర్ కాశ్మీర్ అంటూ ఒకే అంశాన్ని ప్రస్థావిస్తున్నారు.

ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన ఇమ్రాన్ ఖాన్ ముఖ్యంగా కాశ్మీర్ అంశాన్నే మాట్లాడటానికి వాచ్చనన్నారు. కాశ్మీర్ అంశం మాట్లాడుతూనే భారత ప్రధాని మోడీ పై పాక్ పై భారత్ తీరు పై నిప్పులు చెరిగారు. మోడీ కేవలం కాశ్మీర్ లో జరుగుతున్నా ఉగ్రవాదం పైనే ప్రసంగించారని బలూచిస్తాన్ లో భారత్ గూఢచర్యం సంగతేంటని ఆయన ప్రశ్నించారు. భారత్ లో మోడీ ఎన్నికల ప్రచారం అంతా కాశ్మీర్ చుట్టూ పాకిస్థాన్ చుట్టూనే తిరిగాయని ఆయన పేర్కొన్నారు. మాపై దాడి చేసిన వింగ్ కమాండర్ మాకు దొరికినప్పటికీ అభినందన్ ని మేము శాంతి బద్రతల దృష్ట్యా విడిచిపెట్టామని కానీ ఈ అంశాన్ని కూడా మోడీ వ్యక్తిగత విజయం లా తీర్చిదీడుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

చట్ట వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని ఎత్తివేశారని.. 80 లక్షల మంది ప్రజల్ని కర్ఫ్యూలో పెట్టారన్నారు. మోడీ ఆర్ఎస్ఎస్‌లో సభ్యుడని.. హిట్లర్, ముస్సోలిని సిద్ధాంతాల ఆధారంగానే ఆ సంస్ధ పుట్టిందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. భారత్ నుంచి ముస్లింలను తుడిచిపెట్టడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముస్లింల పట్ల ద్వేషం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో భాగమని పాక్ ప్రధాని చెప్పారు. ఈ ద్వేషమే గాంధీని చంపేసిందని ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లో టెర్రరిస్టులు తయారవుతున్నారని కాంగ్రెస్ హోంమంత్రే చెప్పారని ఇమ్రాన్ గుర్తుచేశారు. జాత్యాహంకారంతోనే ఇలాంటి మూర్ఖపు చర్యలకు పాల్పడుతున్నారని.. కాశ్మీరీలు ఈ పరిస్థితిని మౌనంగా సహిస్తారని అనుకోవద్దన్నారు. భారత్ పెద్ద దేశం కాబట్టే కాశ్మీర్ విషయంలో ప్రపంచం మౌనంగా చూస్తోందన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేయగానే నెత్తురు పారుతుందన్నారు. కర్ఫ్యూ ఎత్తివేస్తే కాశ్మీరీలు ఒక్కసారిగా రోడ్ల మీదకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు భారత సైన్యం వాళ్లను కాల్చి చంపేస్తుందని, ఆ సమయంలో కూడా ఇండియా పాకిస్తాన్‌దే తప్పుంటుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: