బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పూరి జగనాథ్ బర్త్ డే స్పెషల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో మాసివ్ మాస్ డైరెక్టర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పూరి జగన్నాథ్. మాస్ ప్రేక్షకులకి క్లాస్ టచ్ తో సినిమాను చూపించే సరికొత్త స్టయిల్ పూరి సొంతం. మేధావులకి మాత్రమె అర్ధమయ్యే ఫిలసఫిస్ ని , సామాన్య జనాలకు అర్ధమయ్యే సులబమైన బాషలో అటాకింగ్ గా చెప్పడంలో పూరి సిద్దహస్తుడు. వర్మ స్కూల్ నుండి వచ్చిన పూరి కెరీర్లో ఎన్నో వోదిదోడుకులు చేవిచుసి, టాలివుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ డైరెక్టర్ స్తాయికి ఎదిగిన పూరి జగనాథ్ పుట్టిన రోజు సందర్బంగా అతని అనితరసాద్యమైన సిని కెరీర్ ఇప్పటి తరం వారికి ఎంతో స్ఫూర్తి దాయకం …,

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పూరి సెప్టెంబర్ 28, 1966 లో జన్మించారు. దర్శకుడిగానే కాక నిర్మాత కూడా సక్సెస్ ఫుల్ గా రానిస్తున్న పూరి ఈ రోజు తన 53 వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. తన ఫస్ట్ సినిమా ‘బద్రి’ తో యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూరి, ఆ తర్వాత తన సొంత ప్రొడక్షన్ లో దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ తో సక్సెస్ ఫుల్ డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ గా కూడా తన స్టామినా నిరూపించుకున్నాడు. ఆ తరవాత వరుసగా వచ్చిన ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’ సినిమాలతో ఒక రకంగా మిలీనియం బిగినింగ్ లో టాలీవుడ్ ని రూల్ చేశాడు.

పూరి జగన్నాథ్ కెరియర్ లో 2005 నుండి బిగిన్ అయితే 2010 వరకు గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ మూవీతో బిగిన్ అయితే…, ఆ తరవాత వచ్చిన ‘పోకిరి’, ఒక రొటీన్ ట్రెండ్ ఫార్మాట్ ని ఫాలో అవుతున్న టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దాంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేసే చాన్స్ ని కొట్టేసిన పూరి, డిఫెరెంట్ మ్యానరిజం తో చెర్రీని ఇంట్రడ్యూస్ చేయడంలో సక్సీడ్ అయ్యాడు. ఆ తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన బుజ్జిగాడు, నేనింతే, బిజినెస్ మ్యాన్, ఇద్దరమ్మాయిలతో, కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాతో కెరీర్లో కొంచం వెనక పడ్డాడు పూరి.

అప్పుడు అందరు ఇక పూరి లేవలేడు, మ్యాటర్ అయిపోయింది అని ఎన్నోరకాల అవమానాలు. దేనికి కూడా పూరి క్రుంగిపోలేదు, కంటెంట్ ఉన్నోడు కామెంట్స్ ని పట్టించుకోడు అన్న పంథాలో, జునియర్ ఎన్టీఆర్ తో ‘టెంపర్’ చేసి తనలోని మాస్ డైరెక్టర్ ని మరో సారి తెలుగు ప్రేక్షకులకి రుచి చూపెట్టాడు. పడిలేచిన కెరటంలా బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన జ్యోతి లక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్ తో మల్లి వరుస ఫ్లాప్స్ ని ముటగట్టుకున్న పూరిపై మల్లి ఇంకెన్నో విమర్శలు…

ఇక గౌరవంగా రిటైర్ అయితే బెటర్ అంటూ సోషల్ మీడియాలో వెటకారాలు. దీనికి తోడు డ్రగ్స్ కేస్ లో తన పేరు రావడం.. ఇలా ఎన్నో అంశాలు పురీ ని భావోద్వేగాలకు గురి చేశాయి. ఈ ప్లేస్ లో మిగితా ఏ డైరెక్టర్ ఉన్నా, క్రుంగిపోయి డిప్రెషన్ కి వెళ్లి సినిమాలను వదిలేసి వెళ్ళిపోయే వాడె, కాని పూరి ధీమా,దైర్యం, కాన్ఫిడెన్స్ వేరు. గోడకు కొట్టిన బంతిలా ఇస్మార్ట్ శంకర్ తో మరో బ్లాక్ బస్టర్ కొట్టి ఇంకా తన సత్త తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు.

మిగితా దర్శకులతో పోలిస్తే పూరి శైలి విభిన్నం. ఏ స్టార్ తో సినిమా చేసినా, సెన్సేషన్ క్రియేట్ చేయడమే పూరి రియల్ టైమ్ టార్గెట్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన లక్ ని చెక్ చేసుకున్న పూరి, ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాకి లెజెండ్రీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో కూడా పనిచేశాడు. ఈ సినిమా ఆస్కార్ లైబ్రరీ కి సెలెక్ట్ అవ్వడం విశేషం. ఇక తన పంతొమ్మిది ఏళ్ల కరియర్ లో 3 నంది అవార్డులను సొంతం చేసుకున్న పూరి, ఫ్యూచర్ లో ఇంకెన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని, మరెన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే టూ డాషింగ్ డైరెక్టర్ పూరి అంటూ విష్ చేస్తుంది మహాన్యూస్..!

Share.

Comments are closed.

%d bloggers like this: