కన్నతల్లిని ముక్కలు ముక్కలుగా నరికిన కసాయి కొడుకు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అనంతపురం జిల్లాలో ధుమారంగా మారిన ఘటన. కన్నతల్లిని కనికరం లేకుండా ముక్కలు ముక్కలుగా నరికిన కసాయి కొడుకు. ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చొని తినడం ఆయన వైనం.. ఎప్పుడూ తల్లిదండ్రులతో గొడవ పడటం అతని వైఖరి.. ఈ వైఖరే చివరికి తన కన్నతల్లి ప్రాణాలు తీసింది. వేట కొడవలితో అతి దారుణంగా నరికేసాడు. రక్తపు మడుగుల్లో పడున్నా కనికరించలేదు.. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మానవత్వం ఎక్కడికి వెళుతుందో అర్థం కాని పరిస్థితి. మనుషుల్లో క్రూరత్వం తారాస్థాయికి చేరింది అనడానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనం.

ఘటన వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా గుంతకల్లు తిలక్ నగర్ కు చెందిన సంజమ్మ, నర్సింహులు దంపతులకు నలుగురు సంతానం ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. నర్సింహులు ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే లో విదులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా కొన్ని నెలల క్రితం మరణించాడు. దీంతో పెద్ద కొడుక్కి తండ్రి ఉద్యోగం వచ్చింది. ఇది ఇలా ఉండగా చిన్న శ్రీనివాసులు కర్ణాటకలోని స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు..

అస్థిరంగా పని చేస్తూ ఉంటాడు… పైగా పెద్ద పోకిరి.. తల్లిదండ్రులపైనే ఆధార పడి పొట్ట గడుపుకుతూ ఉంటాడు. తన తండ్రి మరణించగానే ఇంటికి వచ్చేశాడు. అప్పటినుండి ఎప్పుడూ తన తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు. తన అన్నకి ఉద్యోగం రావడం తాను సహించలేకపోయాడు. దీంతో ఎప్పుడూ తల్లితో గొడవ పడేవాడు. ఈ గొడవలు పేట్రేగాయి.. ఈ క్రమంలో శుక్రవారం కూడా అతడు తల్లితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో రెచ్చిపోయి వేట కొడవలి తీసుకొచ్చి తల్లిని నరికాడు.

తల్లి రక్తపు మడుగుల్లో పది ఉన్నా వదలకుండా అనేక సార్లు వేటు వేశాడు. వెంటనే అక్కడినుండి పరారయ్యాడు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. అప్పటికే సంజమ్మ ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏ కోణంలో హత్య చేసి ఉంటాడు అనే విషయం పై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుదిని పట్టుకోడానికి కసరత్తులు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: