పవన్ కళ్యాణ్ పై తీవ్ర సంచలనమవుతున్న అమితాబ్ తాజా వ్యాక్యాలు….!

Google+ Pinterest LinkedIn Tumblr +

సైరా ప్రమోషన్స్ దేశ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. సౌత్లో కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అక్కడి లోకల్ సూపర్ స్టార్లతో చిరంజీవి రాంచరణ్ చేస్తున్న ఈవెంట్స్ అన్ని కూడా సక్సెస్ అవుతుండటం యూనిట్ కి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే అంశం. పవన్ చీఫ్ గెస్టుగా వచ్చిన హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ తరువాత నేరుగా ముంబై ఫ్లైట్ ఎక్కి అమితాబ్ చెంతకు వాలిపోయాడు మెగా స్టార్. అక్కడి ప్రముఖ మీడియా సంస్థలు, చిన్న చితక యు ట్యూబ్ చానెల్స్ అని తేడా లేకుండా చిరంజీవి అందరికి ఇంటర్వ్యూ ఇస్తూ హైప్ ని పెంచుకునే ప్రయత్నం చేసినా, చిరు అమితాబ్ ఈ ఇద్దరు మెగా స్టార్ల కలిసిచ్చిన ఇంటర్వ్యు నే హైలైట్ గా నిలిచింది. ముక్యంగా అమితాబ్ నోటివెంట వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తావన సోషల్ మీడియాలో మరింత హీట్ ని పెంచింది.

ఇంటర్వ్యూ మొదట్లో చిరంజీవి తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటున్న క్రమంలో అమితాబ్ అప్రయత్నంగానే చిరంజీవి‌ పై ఒక కౌంటర్ వేశారు. తర్వాత రజినీ కాంత్, పవన్ కళ్యాణ్‌లకు కూడా దాన్ని ఆపాదించారు. ‘నేను చిరంజీవికి చాలా సలహాలు ఇస్తుంటాను, కానీ అవేమీ ఆయన పాటించరు. రాజీకీయాల్లోకి వెళ్లొద్దు అని చెప్పాను.రజినీ కాంత్‌కి చెప్పాను…కొంతకాలం తర్వాత చిరు రాజకీయాల్లో నుండి తిరిగివచ్చేసా అన్నాడు, కానీ తరువాత వాళ్ళ తమ్ముడు వెళుతా అంటే అతనికి కూడా చెప్పాను…వినలేదు…అతను రాజీకీయాల పట్ల చాలా ఆసక్తి కలిగిఉంటాడు” అని నవ్వేసారు. దానికి చిరు స్పందిస్తూ ”నేను రాజకీయల్లోకి వెళ్లినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ అర్హత కలిగి ఉన్నాడు” అంటూ అన్నయ్య తమ్ముడికి ఫుల్ సప్పోర్ట్ ఇచ్చిన వైనం జనసైనికులు తెగ ఆనందపడుతున్నారు. ఎప్పుడు చిరు, పవన్ కలవకపోయినా మెగా ఫ్యామిలీలో కలతలు అని రాసేసేవాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా చేసేసాడు చిరంజీవి అంటూ పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: