హనీ ట్రాప్ కేసులో కొత్త మలుపు..! మధ్యప్రదేశ్ లో హనీ ట్రాప్ సెగలు

Google+ Pinterest LinkedIn Tumblr +

మాటల్లో పెడతారు.. మాయ చేస్తారు.. ఆకర్షిస్తారు.. లొంగదీసుకుంటారు.. ప్రైవేట్ గా గడుపుతున్న సమయంలో వీడియోలు తీసి ఆపై బ్లాక్ మెయిల్ చేస్తారు.. ఇదే ప్రస్తుతపు హాట్ టాపిక్ హనీ ట్రాప్..! దేశ వ్యాప్తంగా ఈ హనీ ట్రాప్ కేసు చర్చనీయాంశం అవుతుంది. ఎందరో రాజకీయ ప్రముఖులను ప్రభుత్వ అధికారులను ఆ వీడియోలుతో బయపెడుతున్నారు. ఇక ఇదే సమయంలో మధ్యప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికలు.. నేతలు ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పర్సనల్ గా కూడా విమర్శలు మొదలుపెట్టారు ఇక ఇలాంటి సమయాన్నే హనీ ట్రాప్ నిర్వాహకుల క్యాష్ ఇన్ చేసుకున్నారు.

కొన్ని వందల వీడియోలు తమ వద్ద పెట్టుకొని వాటిని బెరానికి పెట్టారు..ఓపెన్ ఆఫర్ గా చేసి నేతలకు డీల్ ఇచ్చారు.. అన్నీ విడియోలకు కలిపి 30 కోట్లకి ఇస్తామని పబ్లిక్ ఆఫర్ పెట్టారు.. దీంతో నేతలు ఒక్కసారిగా ఎగబడ్డారు. అన్నీ తమకి అవసరం లేదని వాటిలో వారికి కావాల్సినవి కొన్ని ఇవ్వమని కోరారు.. ఆ విడియోలకు గాను 6 కోట్లు చెల్లిస్తామని నేతలు అనగా వారు నిరాకరించారు.. తీసుకుంటే అన్నీ వీడియోలు ఒకేసారి తీసుకోవాలని లేకపోతే వేరే వాళ్ళకు ఇచ్చేస్తామని ససేమిరా అన్నారు.

దీంతో బిజినెస్ కాస్త దాల్ అయ్యింది. అన్నీ వీడియోలు తమకి అవసరం లేదని నేతలు అనడంతో విడివిడిగా అమ్మాలని నిశ్చయించుకున్నారు.. మొత్తానికి అన్నీ వీడియోల అమ్మకాలు జరిపేశారు. మధ్య్ప్రదేశ్ ఎన్నికల్లో హనీ ట్రాప్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రభుత్వం మారడంలో కూడా హనీ ట్రాప్ కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా హానీ ట్రాప్,… బ్లాక్ మెయిలింగ్ కేసులో మధ్యప్రదేశ్ కోర్టు ఐదుగురు మహిళలకు జ్యుడిషియల్ కస్టడీని 14వ తేదీ వరకు పొడగించింది. ఇదిలావుంటే, విచారణ సందర్భంగా తన క్లయింట్ శ్వేతా జైన్ ను దారుణంగా హింసించారని, కొట్టారని ఆమె తరఫు న్యాయవాది ధర్మేంద్ర గుర్జార్ తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: