సైరా రివ్యూ ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చిరంజీవి 20 సంవత్సరాల కోరిక తిరిపోయింది. గుర్రమెక్కి , కత్తి పట్టి, స్క్రీన్ పై యుద్ధం చేయాలన్న కల సాకారం అయిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా సొంత బ్యానర్లో సుమారు ౩౦౦కోట్ల కర్చుతో తీసిన సైరా థియేటర్లలో అట్టహాసంగా అడుగుపెట్ట్టింది. మరి రికార్డు స్తాయి స్క్రీన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ఈ ఉయ్యాలవాడ చరిత్ర.., తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రను తిరగరాస్తుందా, బాహుబలి తో బద్దలైన రికార్డులను రిపీట్ చేయగలదా, అభిమానుల అంచనాలను అందుకుందా, సగటు ప్రేక్షకుడి స్పందన ఏంటో మనమిప్పుడు ఈ రివ్యులో చూసేద్దాం.

కథ….!

మద్రాస్ క్యాపిటల్ గా అప్పుడప్పుడే భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరింప చేసే పనిలో ఉంటుంది బ్రిటిష్ సామ్రజ్యం. ప్రజల నుండి బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్న వీరికి నరసింహ రెడ్డి రూపంలో తిరుగుబాటు ఎదురవుతుంది. నరసింహ రెడ్డి ఒక సామ్రాజ్యనికి పాలే గాడు కాగ అతని సామ్రాజ్యం చుట్టుపక్కల మరో అరవై సంస్థానాలు ఉంటాయి. ఐకమత్యం లేని ఆ సామ్రజ్యాలకు చెందిన రాజులను ఏకం చేసి ఆంగ్లేయులను దేశం నుండి తరిమేయలనుకున్న నరసింహ రెడ్డికి సొంత మనుషులె వెన్నుపోటు పొడుస్తారు. స్వేఛ్చ కోసం బ్రిటిషర్స్ పై నరసింహ రెడ్డి చేసిన ఈ యుద్ధం ఎలా సాగింది, ఆ పోరాటంలో అక్కడి ప్రజలను నరసింహ రెడ్డి ఎలా సంఘటితం చేసి యుద్దానికి సిద్దం చేసాడు, అసలు ఈ తొలి స్వేఛ్చ యుద్దంలో నరసిహ్మ రెడ్డికి విజయం దక్కిందా లేదా అన్నదే అసలు కథ.

కథనం విశ్లేషణ…!

అది రాణి రుద్రమ దేవి సంస్తానం…, భారత సంపద దోచుకుంటున్న బ్రిటీషర్ల తో బికర యుద్ధం చేస్తున్న రుద్రమదేవికి అనుకోని అవాంతరం ఏర్పడుతుంది. బయంతో మధ్యలోనే యుద్ధం ఆపేద్దామని సైనికులు అనుకుంటున్నా సమయంలో.., వారిలో దైర్యాన్ని నింపడానికి ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి వీర చరిత్రను తమ సైనికులకు చెప్పడం మొదలు పెడుతుంది రుద్రమదేవి. ఈ పాత్ర చేసిన అనుష్క నరసింహ రెడ్డి చరిత్రను చెప్పే ఆ క్షణాలు థియేటర్లో ప్రేక్షకుడి రోమాలు నిక్కపోడిచేల చేస్తాయి. రాణి రుద్రమదేవి లాంటి వీర వనితకే స్ఫూర్తినిచ్చిన నరసింహ రెడ్డి చరిత్ర ఇంకెంత గొప్పగా ఉంటుందో అన్న ఆశ సగటు ప్రేక్షకుడికి కలిగించటంలో సఫలం అయినా దాన్ని కొనసాగించటంలో మాత్రం తడబడ్డారు.

చరిత్రను చరిత్రల చెప్తే డాక్యుమెంట్ అవుతుంది. డ్రమాటిక్ గా చెప్తే సినిమా అవుతుంది. సరిగ్గా ఇక్కడే సైరా సినిమా తేడా కొట్టేసింది. చిన్నతనం నుండే ఆంగ్లేయులపై పగతో రగిలిపోతున్న నరసింహారెడ్డి, పెద్దయ్యాక బ్రిటిషర్స్ తో పోరాడే సన్నివేశాలు అతి సాదారణంగా ఉంటాయి. ఎద్దుల పోటి బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి ఇంట్రడక్షన్ యాక్షన్ పర్వలేదనుకున్నా …ఆ తరువాత వచ్చే ఏ యుద్ద సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. లోకల్ బ్రిటిష్ లీడర్ ని చంపి లండన్ కి హెచ్చరిక పంపే ఇంటర్వెల్ సీన్ బిలో యావరేజ్ గా ఉంటుంది. ఇక ఎంత వద్దనుకున్న సైరాని బాహుబలితోనే పోల్చుకుంటాడు సగటు అభిమాని. ఏ రేంజిలో ఉంటాయో అనుకున్నసైరా క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు అన్ని కూడా తేలిపోయాయి. 80 కోట్లతో తీసిన వార్ సీన్స్ ఇవేనా అనిపిస్తుంది.

ఇక ఇన్ని మైనస్ లా మధ్యకూడా సైరా లో మనకి ఊపిరి అడనివ్వని సన్నివేశం ఏదన్న ఉందంటే అది ఆకరి సీన్ మాత్రమె. అప్పటివరకు నీరసపడిపోయిన ప్రేక్షకులని ఒక్కసారిగా బావోద్వేగానికి గురిచేస్తుంది ఆ సీన్. సినిమాను కాపాడగలిగే ఏకైక సీన్ ఇది. గ్లామర్ , డాన్స్ , ఫైట్స్ కి మరో రూపమైనా మన మెగా స్టార్ చిరంజీవిని అలా ఆ స్థితిలో చూసిన ప్రతివాడికి కన్నీళ్ళు వచ్చి తీరాల్సిందే. ఆ స్తాయి సీన్లు కాని సినిమాలో మరో రెండు చోట్ల పడుంటే బాహుబలిలా సైరా కూడా చరిత్రను తిరరాసేది. బాహుబలి తరువాత మన తెలుగు వాళ్ళ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే అలాంటి సువర్ణ అవకాశం చేజారిపోయింది అని చెప్పొచ్చు .

పర్ఫార్మెన్స్ స్…!

చిరంజీవి నటన పరంగా ఎక్కడ వంకలు పెట్టాల్సిన అవసరం రాకున్న, ఆయన వయసే సైరా పాత్రకి కొంచం మైనస్ అయింది. మెలో డ్రమాటిక్ గా కాకుండా కొంచం సహజంగా నటిస్తే ఇంకెంతో బావుండేది. అక్కడక్కడ కొన్ని మైనస్ లు ఉన్నా క్లైమాక్స్ లో తన నటనతో మ్యాజిక్ చేసేసాడు చిరంజీవి. ఆయన 150 ఫిలిమ్స్ హిస్టరీలో .., సైరాలోని ఈ ఆకరి సీన్ చిరంజీవి కెరీర్ బెస్ట్ పర్ఫర్మేన్సుగా నిలిచిపోతుంది. అదే స్తాయిలో చేసిన తమన్నాపర్ఫర్మేన్సు సైరాకి మరో ప్లస్. ఒక కళాకారిణి నుండి సూసైడ్ బాంబ్ గా మారి ఆంగ్లేయులపై చేసిన పోరాట సన్నివేశాల్లో తమన్నా సబాష్ అనిపించుకుంటుంది.ఇక అమాయకపు బార్య పాత్రలో నయన్ తార మెప్పించింది.

ఇక అమితాబ్ , కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి వంటి బ్రిలియంట్ యాక్టర్స్ ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు దర్స్ధకుడు. అమిత్ త్రివేది సంగీతం చాల బావున్నా కాని కీరవాణి ఉంటే మరోలా ఉండేది అన్న బావన వస్తుంది. సైరా ఆధ్యంతం రాంచరణ్ దైర్యమే కనిపిస్తుంది. హాలివుడ్ ఐకానిక్ ఫిలిం బ్రేవ్ హార్ట్ ని తలపిస్తున్ సాగిన సైరా కోసం ఎక్కడ వెనకడుగు వేయలేదు చరణ్. సినిమా ఆద్యంతం బారితనం కనిపిస్తుంది. టేకింగ్ పరంగా సురేందర్ రెడ్డి తన మార్క్ ని చూపించాడు. స్టయిలిష్ విజువల్స్ , బారి గ్రాఫిక్స్ తో తెరను నింపేసిన సురేందర్ రెడ్డి పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే.

ఇక ఆకరిగా మనకి తెలియని మన తెలుగు వీరుడి చరిత్రను సినిమాగా తీసిన చిరంజీవి ప్రయత్నం అభినందనియం. ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాటాలే ఇప్పటి మన స్వేఛ్చ వాయువులకు కారణం. అలాంటి మహానుబావుల త్యాగాలను స్పురించే సైరా వంటి సినిమాను ప్రతి భారతీయుడు ఒక్కసారైనా చూడాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: