వదినమ్మతో పార్టీ టైమ్.., శిరీష్ పై విమర్శలు…

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటాడు. మెగా హీరోస్ సినిమాలు, వారి ప్రమోషనల్ ఈవెంట్స్ , అల్లు ఫ్యామిలీ ఈవెంట్స్ ఇలా ఎవైన కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉండే అల్లు శిరీష్ తన వదినమ్మ స్నేహ రెడ్డి తో తానున్న ఫోటోని షేర్ చేసాడు. సెప్టెంబర్ 29న స్నేహ రెడ్డి పుట్టిన రోజు కావడంతో, తన వదినమ్మకు బర్త్ డే విశేస్  చెబుతూ తనతో ఆ నైట్ పార్టిలో దిగిన ఫోటోని పోస్ట్ చేసి మెసేజి పెట్టాడు.

“నాకెప్పుడు ఇష్టమైనవి చేసి పెట్టే.. సరదాగా ఉండే స్నేహ వదినకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు సూపర్ గా.. సెలవులతో ఉండే ఏడాదిగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ వదినమ్మ పై అభిమానాన్ని కురిపించాడు. నైట్ పార్టీలో వీరిద్దరి హగ్గింగ్ ఫోటో చూసిన వారెవరికి అయినా వదిన మరిదిలా ప్రేమ ఆప్యాయత కనిపిస్తాయి. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తు, వదిన-మరిది మధ్యలో ఉండే అందమైన అనుబంధం.. ఈ ఫ్రెండ్లీనెస్ చూసి చాలా మంది మెచ్చుకున్నారు. కాని కొందరు మాత్రం ఈ ఫోటోపై విమర్శలకు దిగుతున్నారు. బాలివుడ్ లో మరియు నార్త్ స్టేట్స్ లో అయితే ఓకే కాని, మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇలా వదిన మరదలు కౌగిలించుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా ఆ ఫోటోలో స్నేహ రెడ్డి మోడర్న్ డ్రెస్ లో ఉండటం, ఆ డ్రెస్ లో ఈ హగ్గింగ్ పిక్ ని హఠాత్తుగా చూస్తే తప్పుగా అర్ధం చేసుకుంటారని, ఇది మన సాంప్రదాయం కాదని అంటున్నారు. దీంతో ఇదేంటి శిరీష్.. ఇలాంటి ఫోటో పోస్ట్ చేశావని కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఏదేమైనా మనం చూసే దృష్టి కోణం నుండే మన దృక్కోణం ఉంటుంది. పవిత్ర తల్లి కొడుకుల సంబండంతో సమానమైన వదిన మరది ల బాంధవ్యాన్ని వంకర చూపులతో చూస్తున ఈ సోకాల్డ్ కల్చర్డ్ జనాలకు ఇలాంటి తప్పుడు కామెంట్స్ చేయడం సాంప్రదాయం కాదని తెలియకపోవడం విచారకరం.

allu arjun family

allu arjun family

 

Share.

Comments are closed.

%d bloggers like this: