అర్చనకు నిశ్చితార్దం..! భర్త షాకింగ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకప్పటి హాట్ హీరోయిన్ అర్చన.. పెళ్లి చేసుకోబోతోంది. దాంతో ప్రస్తుతం సినీ జీవితానికి టాలీవుడ్ నటి అర్చన ముగింపు పలికేందుకు సిద్ధమయ్యింది. వ్యాపారవేత్త అయిన జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడేందుకు సిద్ధమైంది. నేడు హైదరాబాద్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. గత కొద్దికాలంగా ప్రేమలో ఉందనే వార్తలకు ఈ నిశ్చితార్థంతో తెర దించింది. ఎంతో వైభవంగా జరిగిన అర్చన నిశ్చితార్థ వేడుకకు సీనీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ మిత్రులు ప్రత్యక్షమయ్యారు.

తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన అర్చన.. ఇప్పుడు అతన్ని అందరికీ చూపించేసింది. అక్టోబర్ 3న బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో వీళ్ళ ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి సుమంత్, నవదీప్, శివబాలాజీ, మధుమిత వచ్చారు. ఓ లీడింగ్ హెల్త్ కేర్ కంపెనీని రన్ చేస్తున్నా జగదీష్ పెద్ద వ్యాపారవేత్త అని తెలుస్తుంది. ఇక అర్చన తల్లిదండ్రులైన విజయ శాస్త్రి, సుధాకర్ శాస్త్రి.. జగదీష్ తల్లిదండ్రులు ప్రతిభ, భక్తవత్సలం కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖలు, బంధువులు ఈ వేడుకకు హాజరై అర్చన, జగదీష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాప్ సిని సెలబ్రేటిలను ఆహ్వానించని అర్చన, పెళ్ళికి మాత్రం టాలివుడ్ ప్రముఖుల సమక్షంలో చేసుకోనుందని తెలుస్తుంది. ఏది ఏమైనా అందం , అబినయంతో కుర్రకారుని ఉర్రుతలుగించిన ఈ అందాల అర్చన సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని ఆశిద్దాం.

Share.

Comments are closed.

%d bloggers like this: