బక్కచిక్కిన బాలయ్య లుక్స్…! బాలయ్య కేక…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లో బాలకృష్ణ బరువు కూడా పెరిగాడు. మరోవైపు బాలకృష్ణ ‘జై సింహ’ ఫేమ్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 105 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. తాజాగా కేయస్ రవికుమార్ సినిమా కోసం దాదాపు 10 కేజీలు తగ్గాడు బాలయ్య.

ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ కోసం కూడా కాస్త బరువు తగ్గి కనిపించాడు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో మళ్లీ బరువు పెరిగిపోయాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ డైట్ చేస్తూ 11 కేజీలు తగ్గిపోయాడు. కేయస్ రవికుమార్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైపోయింది.

ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా కమిటయ్యాడు బాలయ్య. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుందని తెలుస్తుంది. దీనికోసం మరోసారి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే కేయస్ రవికుమార్ సినిమాలోని లుక్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు మరోటి ప్రయత్నిస్తున్నాడు ఈయన. ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు బాలకృష్ణ. ఇందులో కుర్ర పాత్ర కోసం ఇప్పటికే 15 కేజీలు తగ్గాడు బాలయ్య. ప్రతీరోజూ 5 గంటలు జిమ్ చేస్తూ.. పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటూ రైస్ కూడా మానేసాడు బాలకృష్ణ.

balakrishna new look for his upcoming film

balakrishna new look for his upcoming film

Share.

Comments are closed.

%d bloggers like this: