చిరంజీవితో త్రివిక్రమ్ స్పెషల్ ఇంటర్వ్యూ ….!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎందుకో తెలుదు కాని.., మొదటినుండి సైరా చిత్ర యూనిట్ చాల లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తున్నారు. దాదాపు ౩౦౦ కోట్ల బడ్జెట్ తో బారి స్కేల్ లో సినిమా చేస్తున్నా ఎక్కడ కూడా ప్రామిసింగ్ ప్రమోషన్స్ లేవు. జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తోనే సరిపెట్టుకున్నారు. సరిగ్గా ఆ స్ట్రాటజి వర్క్ అవుట్ అయి, అభిమానుల్లో బారి అంచనాలు పెరగలేదు. అందుకే సైరా లో కొన్ని బొక్కలున్నఅవెక్కడ హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు సూపర్ హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ వారు ప్రచారంలో మరింత జోరుని కొనసాగించాలని బావిస్తున్నారు. మొదటి రోజుకి రెండవ రోజుకి కలెక్షన్స్ లో కొంచం డ్రాప్ కనిపించడంతో , దర్శకుడు త్రివిక్రమ్ తో చిరంజీవిని ఇంటర్వ్యూ చేయించాలని మూవీ టీమ్ భావిస్తుంది. మెగాస్టార్ ఫ్యామిలీతో డైరెక్టర్ త్రివిక్రమ్ కి చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. అతను డైరెక్ట్ చేసిన సినిమాలలో చాలా సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ సినిమాలే ఉన్నాయి. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవిని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్ వస్తుంది. దీనితో త్రివిక్రమ్ కూడా ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకుంటారు. త్రివిక్రమ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తే అది సైరా మూవీకి తెలుగులో చాలా పెద్ద ప్లస్ అవుతుందని సైరా యూనిట్ అనుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: